వయసు పెరగడానికి హర్మోన్ ఇంజక్షన్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
19 April 2026
టాలీవుడ్ చందమామ హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, తొలి చిత్రంతోనే స్టార్‌డమ్ సొంతం చేసుకుంది.
ఆ సమయంలో ఆమె గురించి ఒక వింతైన వార్త ఇండస్ట్రీలో తెగ ప్రచారమైంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా అంత పెద్దగా ఎలా కనిపిస్తోంది? వ్యక్తమయ్యాయి.
తన శారీరక ఎదుగుదల కోసం 'గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు' తీసుకుందా? అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ రూమర్‌పై హన్సిక గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ.. "నేను గ్రోత్ ఇంజెక్షన్లు తీసుకున్నానని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అదంతా చెత్త ప్రచారం అని అన్నారు.
నిజం చెప్పాలంటే, నాకు ఇంజెక్షన్లు అంటే చాలా భయం. ఇప్పటికీ ఏదైనా అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఇంజెక్షన్ వేయాల్సి వస్తే ఏడుస్తూనే ఉంటాను అని అన్నారు.
అలాంటిది నేను అందం కోసం, ఎదుగుదల కోసం ఇంజెక్షన్లు తీసుకున్నాననడం హాస్యాస్పదం అని ఆమె పేర్కొన్నారు. అప్పట్లో సెన్సేషన్ కోసమే ఇలాంటి వార్తలు సృష్టించారని ఆమె మండిపడ్డారు.
అల్లు అర్జున్ సరసన 'దేశముదురు' చిత్రంలో నటించినప్పుడు తన వయసు కేవలం 15 ఏళ్లేనని హన్సిక గుర్తుచేసుకున్నారు. ఈ మూవీతోనే ఆమె తెలుగులో స్టార్ డమ్ సంపాదించుకుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హిమాచల్ ప్రదేశ్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చలి తట్టుకోలేక, సరైన నిద్ర లేక ఎన్నోసార్లు ఏడ్చేసినట్లు ఆమె తెలిపారు. ఆ మూవీ ఆమె కెరీర్ మలుపు తిప్పింది.