AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pillow: ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త

Pillow: ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త

Phani CH
|

Updated on: Apr 20, 2026 | 5:44 PM

Share

మంచి నిద్ర కోసం దిండుపై చాలామంది శ్రద్ధ చూపరు. దిండ్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. పాత దిండ్లు దుమ్ము, చెమట, బ్యాక్టీరియాకు నిలయమై అలర్జీలు, మొటిమలు, శ్వాసకోశ, చర్మ సమస్యలు, మెడ నొప్పులకు దారితీస్తాయి. దిండు ఆకారం మారడం, గడ్డలు కట్టడం లేదా నిద్ర లేవగానే మెడ పట్టేసినా మార్చాలి. మెటీరియల్‌ను బట్టి 6 నెలల నుండి 4 సంవత్సరాల వరకు వాడవచ్చు. మీ ఆరోగ్యానికి పాత దిండును మార్చడం అత్యవసరం.

మంచి నిద్ర కోసం మనం పరుపులు, బెడ్‌రూమ్ వాతావరణంపై చూపే శ్రద్ధ, తల కింద పెట్టుకునే దిండుపై చూపం. చాలామంది ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతుంటారు. అయితే, దిండ్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందని మీకు తెలుసా? ఏళ్లతరబడి ఒకే దిండును వాడుతూ..వాటిని సకాలంలో మార్చకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పాత దిండును ఎందుకు మార్చాలి? నిపుణులేమంటున్నారో ఇప్పుడు చూద్దాం! మనం దిండు గలేబులు మారుస్తున్నా, దిండు లోపలి భాగంలో దుమ్ము, చెమట, మృత చర్మాలు చేరి బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. దీనివల్ల అలర్జీలు మొటిమలు రావడమే కాదు, దిండులోని బ్యాక్టీరియా వల్ల చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు కూడా రావచ్చంటున్నారు నిపుణులు. వాస్తవానికి నిద్రపోయేటప్పుడు తల, మెడ, వెన్నెముక ఒకే సరళరేఖలో ఉండాలి. పాతబడిన దిండు మెత్తగా అయిపోయి లేదా గడ్డలు కట్టడం వల్ల మెడకు సరైన సపోర్ట్ ఇవ్వదు. ఇది దీర్ఘకాలిక మెడ, భుజాల నొప్పులకు దారితీస్తుందంటున్నారు. ఇక ఏ దిండును ఎప్పుడు మార్చాలి అనే విషయానికి వస్తే.. దిండు మన్నిక అది తయారైన పదార్థంపై ఆధారపడి ఉంటుంది. సింథటిక్ ఫైబర్ తో తయారైన దిండ్లు 6 నుండి 18 నెలలు వరకూ వాడొచ్చు. మెమరీ ఫోమ్ (Memory Foam)తో తయారు చేసినవాటిని 2 నుండి 3 ఏళ్లు వాడొచ్చు. లేటెక్స్ 3 నుండి 4 ఏళ్లు వరకూ వాడొచ్చు. ఎందుకంటే ఇవి సహజసిద్ధమైనవి, ఎక్కువ కాలం మన్నుతాయి.ఇక మీ దిండు మార్చాల్సిన టైమ్‌ వచ్చింది అని చెప్పడానికి ముఖ్యంగా నాలుగు సంకేతాలను గమనించవచ్చు. మొదటిది దిండు ఆకారం దెబ్బతినడం. దిండుపై మడతలు పడటం లేదంటే లోపల గడ్డలుగా అనిపించడం. దిండును సగానికి మడిచినప్పుడు అది వెంటనే తన పాత స్థితికి రాకపోవడం. నిద్రలేవగానే మెడ పట్టేయడం లేదా భుజాల నొప్పులు రావడం. దిండుపై శాశ్వత పసుపు మచ్చలు ఏర్పడటం, దుర్వాసన రావడం ఇలాంటివి జరిగినప్పుడు అర్జెంట్‌గా మీ దిండును మార్చేయాల్సిందే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మంచి నిద్ర ఆరోగ్యానికి పునాది. కాబట్టి మీ దిండు పరిస్థితిని ఒకసారి గమనించండి. అది పాడైపోయిందని అనిపిస్తే, వెంటనే కొత్తది కొనుగోలు చేయడం మీ ఆరోగ్యానికి మీరు చేసే మంచి పెట్టుబడి అవుతుందని గుర్తుంచుకోండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బయటకు వెళ్దామని బైక్‌ తీసిన వ్యక్తి.. దెబ్బకు హడల్‌

ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం.. రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్

మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే

మన ఉసిరి చెట్టుకి.. మలక్కా జలసంధికీ ఏంటా సంబంధం ?

Follow Us