దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే సినిమా ప్రారంభం చాలా నెమ్మదిగా సాగుతుంది. మొదటి భాగం మొత్తం పాత్రల పరిచయం, చిత్తూరు గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజల అమాయకత్వం, వారి మధ్య ఉండే పట్టింపులు, చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాకులతోనే నిండిపోతుంది.