AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తతో గొడవలు కట్ చేస్తే.. విడాకుల తర్వాత తల్లయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా ఉండేవారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. తన క్యూట్ క్యూట్ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆమె. హీరోయిన్ గానే కాదు డైరెక్టర్ గానూ రాణించింది.

భర్తతో గొడవలు కట్ చేస్తే.. విడాకుల తర్వాత తల్లయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2026 | 1:31 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాదు దర్శకురాలిగానూ సత్తా చాటింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది ఈ అందాల తార. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తల్లి అయ్యింది. ఇప్పటికీ ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తుంది ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

సీనియర్ హీరోయిన్ రేవతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1966 జులై 8న కేరళలోని కొచ్చిలో మలన్ కట్టి కేలన్ని, లలిత కేలన్ని దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి భారత సైన్యంలో మేజర్‌గా పనిచేశారు. చిన్నతనం నుంచే కళలపై మక్కువ పెంచుకున్న రేవతి, ఏడేళ్ల వయసు నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందారు. 1979లో చెన్నైలో ఆమె భరతనాట్య అరంగేట్రం జరిగింది. ఒక స్కూల్ ఫ్యాషన్ షోలో పాల్గొన్న రేవతి ఫోటో ఒక పత్రిక కవర్‌పేజీపై వచ్చింది. ఈ ఫోటోను చూసిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా, తన చిత్రం ‘మన్ వాసనై’ కోసం ఆమెను ఎంపిక చేశారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో రేవతికి వరుసగా అవకాశాలు వచ్చాయి. రేవతి కేవలం తమిళం, మలయాళం చిత్రాలకే పరిమితం కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మానస వీణ’, ‘సీతమ్మ పెళ్లి’, ‘రావుగారిల్లు’, ‘ప్రేమ’, ‘లంకేశ్వరుడు’, ‘అంకురం’, ‘గాయం’, ‘గాయం 2’, ‘గణేష్’, ‘ఈశ్వర్’, ‘అనుక్షణం’, ‘లోఫర్’, ‘సైజ్ జీరో’, ‘బ్రహ్మోత్సవం’, ‘యుద్ధం శరణం’ వంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా ‘ప్రేమ’ చిత్రంలోని పాత్ర ఆమెను యువతకు దగ్గర చేసింది.

నటిగానే కాకుండా, రేవతి గొప్ప దర్శకురాలిగా కూడా నిరూపించుకున్నారు. ఆమె దర్శకత్వం వహించిన నాలుగు చిత్రాలలో ఆంగ్ల చిత్రం ‘మిత్ర, మై ఫ్రెండ్’, రెండు హిందీ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం ఉన్నాయి. అయితే రేవతి వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో మలుపులు ఉన్నాయి. 1986లో సినీటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, అభిప్రాయ భేదాల కారణంగా 2002 నుండి విడివిడిగా జీవించి, 2013లో విడాకులు తీసుకున్నారు. 2018లో రేవతి కృత్రిమ ఫలదీకరణ ద్వారా ఒక కూతురికి జన్మానిచారు. ఈ విషయం అప్పట్లో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. సినిమా రంగంలోనే కాకుండా సామాజిక సేవలోనూ రేవతి చురుకుగా పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి
Revathi

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us