Best Selling Bikes: ఎగబడి కొంటున్నారట.. దేశంలో ఈ బైక్ అమ్మకాలలో టాప్.. 5 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే!
Best Selling Bikes: ఆటో మొబైల్ రంగంలో మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఈ బైక్ అమ్మకాలలో దేశంలోనే టాప్ గేర్‌లో నడుస్తోంది. అన్ని బైక్‌లను వెనక్కి నెట్టి ముందంజలో దూసుకుపోతోంది. బ్రేకులు వేయకుండానే పరుగులు పెడుతోంది. అయితే దేశంలో టాప్ సెల్లింగ్ బైక్‌లగురించి తెలుసుకుందాం..

Best Selling Bikes: ద్విచక్ర వాహన విభాగం గత నెలలో జనవరి 2026 నెలలో బలమైన వృద్ధిని సాధించింది. టాప్ 10 మోడళ్ల మొత్తం అమ్మకాలు మొత్తం 902,096 యూనిట్లు. గత సంవత్సరం జనవరిలో అమ్ముడైన 750,060 యూనిట్ల నుండి 20.27 శాతం ఎక్కువ. కమ్యూటర్ విభాగంలో బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ ఈ సంవత్సరం చాలా మోడళ్లు బాగా అమ్ముడయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ బైక్ అత్యధికంగా అమ్మకాలు:
వెలువడిన గణాంకాల ప్రకారం.. జనవరి 2026లో హీరో స్ప్లెండర్ 324,019 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జనవరిలో ఇది 259,431 యూనిట్లు. అంటే ఈ బైక్ 24.90 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా మారింది.
రెండవ స్థానంలో ఏ బైక్..
హీరో స్ప్లెండర్ తర్వాత హోండా షైన్ రెండవ స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ బైక్ 161,224 యూనిట్లు అమ్ముడైంది. గత సంవత్సరం అమ్ముడైన 168,290 యూనిట్లు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 4.20 శాతం స్వల్పంగా తగ్గాయి.
మూడో స్థానంలో బజాజ్:
బజాజ్ పల్సర్ గత నెలలో 129,600 యూనిట్లు అమ్ముడుపోయి మూడవ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఈ బైక్ 104,081 యూనిట్లు అమ్ముడైంది. అంటే సంవత్సరంతో పోలిస్తే 24.52 శాతం వృద్ధి.
నాల్గవ స్థానంలో హీరో బైక్:
హీరో బైక్స్ టాప్ 5లో ఒకటి కాదు. రెండు ఉన్నాయి. జనవరి 2026 లో హీరో HF డీలక్స్ 71,690 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం జనవరిలో 62,223 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే బైక్ కోసం సంవత్సరంతో పోలిస్తే 15.21 శాతం వృద్ధి ఉంది.
టాప్ 5లో TVS బైక్:
టీవీఎస్ అపాచీ మిడ్-ప్రీమియం విభాగంలో బాగా పనిచేస్తోంది. గత నెలలో 51,191 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఈ బైక్ అమ్మకాలు 34,511 యూనిట్లు. అంటే సంవత్సరంతో పోలిస్తే 48.33 శాతం వృద్ధి.
ఇది కూడా చదవండి: OYO: ఓయో కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే మెయిన్ టార్గెట్!
ఇది కూడా చదవండి: Multibagger: ఈ 5 స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయా.. ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. లక్షకు ఎంతిచ్చాయంటే?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




