AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom Fry Recipe: సాయంత్రం స్నాక్‌గా వేడివేడిగా మష్రూమ్ ఫ్రై చేసుకోండి.. రుచి అదిరిపోతుంది!

సాయంత్రం వేళ టీతో పాటు ఏదైనా కారం కారం స్నాక్ తినాలనిపిస్తుందా? ప్రతిరోజూ బజ్జీలు, పునుగులు, పకోడీలు కాకుండా కాస్త కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నారా? అయితే మష్రూమ్ ఫ్రై మంచి ఎంపిక. తక్కువ సమయంలోనే ఇంట్లో అందుబాటులో ఉండే మసాలాలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే మష్రూమ్స్‌కు మసాలాలు కలిస్తే రుచి అదిరిపోతుంది.

Mushroom Fry Recipe: సాయంత్రం స్నాక్‌గా వేడివేడిగా మష్రూమ్ ఫ్రై చేసుకోండి.. రుచి అదిరిపోతుంది!
Mushroom Fry Recipe Spicy And Tasty Snack
Bhavani
|

Updated on: Nov 18, 2026 | 8:15 PM

Share
మష్రూమ్స్‌తో కూరలు, పులావ్ మాత్రమే కాదు.. రుచికరమైన స్నాక్ కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం, గరం మసాలా వంటి పదార్థాలతో చేసే ఈ ఫ్రైను పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తినవచ్చు. మరి ఈ మష్రూమ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మష్రూమ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు

  • మష్రూమ్స్ – 250 గ్రాములు

  • ఉల్లిపాయ – 1

  • పచ్చిమిర్చి – 2

  • జీలకర్ర – అర టీస్పూన్

  • పసుపు – పావు టీస్పూన్

  • మిరియాల పొడి – పావు టీస్పూన్

  • కారం – పావు టీస్పూన్

  • గరం మసాలా – అర టీస్పూన్

  • కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు

  • ఉప్పు – తగినంత

  • నూనె – సరిపడా

మష్రూమ్ ఫ్రై తయారీ విధానం

ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి స్వల్పంగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి.

ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ను పాన్‌లో వేయాలి. వాటిని కలుపుతూ కొద్దిసేపు ఉడికించాలి. అనంతరం పసుపు, మిరియాల పొడి, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

మష్రూమ్స్‌లోని నీరు ఆవిరయ్యే వరకు ఉడికించాలి

మష్రూమ్స్ ఉడికేటప్పుడు వాటిలోని నీరు బయటకు వస్తుంది. కాబట్టి ఆ నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మిశ్రమాన్ని ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మష్రూమ్స్ కొద్దిగా బంగారు రంగులోకి మారిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసి మరో ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడి మష్రూమ్ ఫ్రై సిద్ధమైనట్లే.

మష్రూమ్ ఫ్రైని దేనితో తినవచ్చు?

ఈ మష్రూమ్ ఫ్రైను వేడివేడిగా పావ్ లేదా బ్రెడ్‌తో కలిపి తినవచ్చు. సాయంత్రం స్నాక్‌గా లేదా భోజనంలో సైడ్ డిష్‌గా కూడా వడ్డించుకోవచ్చు. కారం, మసాలాల రుచితో ఉండే ఈ వంటకం సాధారణ స్నాక్స్‌కు భిన్నంగా ఉంటుంది.

 

 

Follow Us
సాయంత్రం ఆకలేస్తోందా? కారం కారం మష్రూమ్ ఫ్రై ఇలా చేసేయండి!
సాయంత్రం ఆకలేస్తోందా? కారం కారం మష్రూమ్ ఫ్రై ఇలా చేసేయండి!
ఈ టాలీవుడ్ విలన్ చనిపోయే ముందు ఇంత క్షోభ అనుభవించారా?
ఈ టాలీవుడ్ విలన్ చనిపోయే ముందు ఇంత క్షోభ అనుభవించారా?
చేతులు లేకపోతేనేం.. గుండెధైర్యం ఉందిగా.. విధినే ఎదురించి పిల్లల..
చేతులు లేకపోతేనేం.. గుండెధైర్యం ఉందిగా.. విధినే ఎదురించి పిల్లల..
నవ్వుతోనే ఈ రోగానికి చెక్ పెట్టొచ్చు! లాఫ్టర్ థెరపీతో ఇన్ని లాభాల
నవ్వుతోనే ఈ రోగానికి చెక్ పెట్టొచ్చు! లాఫ్టర్ థెరపీతో ఇన్ని లాభాల
పళ్ల మధ్య ఖాళీ ఉందా?.. మీరు తోపులెహె..
పళ్ల మధ్య ఖాళీ ఉందా?.. మీరు తోపులెహె..
జున్నులా ఉండే క్రీమ్ క్యారమెల్ పుడ్డింగ్.. చేసుకోండి సులభంగా
జున్నులా ఉండే క్రీమ్ క్యారమెల్ పుడ్డింగ్.. చేసుకోండి సులభంగా
నల్లగా మారిన వెండి పట్టీలు, మెట్టెలను ఇలా శుభ్రం చేయండి..
నల్లగా మారిన వెండి పట్టీలు, మెట్టెలను ఇలా శుభ్రం చేయండి..
తండ్రి లక్కీ నంబర్‌తో టికెట్.. 200 గ్రాముల బంగారం గెలుపు!
తండ్రి లక్కీ నంబర్‌తో టికెట్.. 200 గ్రాముల బంగారం గెలుపు!
అన్నం, చపాతీ, బిర్యానీలోకి అదిరిపోయే ఘుమఘుమలాడే మటన్ గ్రేవీ కర్రీ
అన్నం, చపాతీ, బిర్యానీలోకి అదిరిపోయే ఘుమఘుమలాడే మటన్ గ్రేవీ కర్రీ
IND vs NZ 1st Test: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరు బెంచ్‌కే..
IND vs NZ 1st Test: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరు బెంచ్‌కే..