AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజిలెన్స్‌కు చిక్కిన మైనింగ్ అధికారి.. కుప్పలు తెప్పలుగా బయటపడ్డ నోట్ల కట్టలు..!

ఒడిశాలో అవినీతి తిమింగళం చిక్కింది. సదరు అధికారి అక్రమం సంపాదన చూసి పోలీసులే షాక్ అయ్యారు. భువనేశ్వర్‌లోని అవినీతి నిరోధక సంస్థ బుధవారం (ఫిబ్రవరి 25) కటక్ సర్కిల్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతికి చెందిన భువనేశ్వర్ ఫ్లాట్ నుండి రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇది అతిపెద్ద నగదు స్వాధీనం అని అధికారులు అభివర్ణించారు.

విజిలెన్స్‌కు చిక్కిన మైనింగ్ అధికారి.. కుప్పలు తెప్పలుగా బయటపడ్డ నోట్ల కట్టలు..!
Corruption In Bhubaneswar Crore Seizure
Balaraju Goud
|

Updated on: Feb 25, 2026 | 1:13 PM

Share

ఒడిశాలో అవినీతి తిమింగళం చిక్కింది. సదరు అధికారి అక్రమం సంపాదన చూసి పోలీసులే షాక్ అయ్యారు. భువనేశ్వర్‌లోని అవినీతి నిరోధక సంస్థ బుధవారం (ఫిబ్రవరి 25) కటక్ సర్కిల్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతికి చెందిన భువనేశ్వర్ ఫ్లాట్ నుండి రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇది అతిపెద్ద నగదు స్వాధీనం అని అధికారులు అభివర్ణించారు. లైసెన్స్ పొందిన బొగ్గు విక్రేత నుండి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా మొహంతి పట్టుబడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు మహంతి నివాసం తోపాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు.

మహంతి అరెస్టు తర్వాత, విజిలెన్స్ అధికారులు అతనికి సంబంధించిన అనేక ప్రదేశాలపై దాడులు చేశారు. వాటిలో పాటియాలోని శ్రీవిహార్‌లోని నేచర్స్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లోని అతని నివాస ఫ్లాట్, భద్రక్ జిల్లాలోని మాతాసాహిలోని అతని బంధవుల ఇల్లు, కటక్‌లోని అతని కార్యాలయంపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికారులు అతని భువనేశ్వర్ ఫ్లాట్ లోపల దాచిన నగదు ట్రాలీ బ్యాగులు, అల్మారాలలో దాచిన పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఖచ్చితమైన మొత్తాన్ని నిర్ణయించడానికి లెక్కిస్తున్నారు. నిందితుడి ఆఫీస్ డ్రాయర్, వ్యక్తిగత వస్తువుల నుండి రూ. 1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

భువనేశ్వర్‌లోని పహ్లాలో దాదాపు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండంతస్తుల భవనం, దాదాపు 130 గ్రాముల బంగారం సహా ఇతర ఆస్తులను కూడా విజిలెన్స్ బృందం కనుగొంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి, దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఆ అధికారి వద్ద ఇంకా ఎక్కువ నల్లధనం, అక్రమ వస్తువులు ఉండే అవకాశం ఉందని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us