AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా వచ్చి 22 ఏళ్లు.. ఒకేఒక్క సీన్‌తో బ్లాక్ బస్టర్.. థియేటర్స్‌లో బ్లాస్ట్..!

కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై సంచలన విజయాలు అందుకుంటున్నాయి. కానీ కొన్ని సినిమాలు భారీ అంచనాలను క్రియేట్ చేసినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్ర బోల్తా కొడుతుంటూన్నాయి. కొన్ని మూవీస్ ఒకే ఒక్క సీన్ తో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.

సినిమా వచ్చి 22 ఏళ్లు.. ఒకేఒక్క సీన్‌తో బ్లాక్ బస్టర్.. థియేటర్స్‌లో బ్లాస్ట్..!
Tollywood Movie
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2026 | 12:54 PM

Share

కొన్ని సినిమాలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అందుకొని సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటాయి. మరికొన్ని సినిమాలు భారీ  అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. ఒక సినిమా విజయం సాధించాలంటే చాలా అంశాలు ఉంటాయి. ముఖ్యంగా సినిమాలో కథ.. కథ కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. ఇక కొన్ని సినిమాల సక్సెస్ కు మ్యూజిక్ హెల్ప్ అవుతుంది. లేదా సినిమాలో కామెడీ హెల్ప్ అవుతుంది. అలాగే సినిమాలో ఒక్క సన్నివేశం చాలు థియేటర్స్ లో బ్లాస్ట్ అవ్వడానికి.. అలాగే ఇప్పుడు ఓ సినిమా భారీ హిట్ అవ్వడానికి ఒకేఒక్క సీన్ చాలా హెల్ప్ అయ్యింది. ఆ ఒక్క సీన్ కు థియేటర్స్ లో ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు.

దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్ ను పెంచేసింది. ఎన్నిసార్లు చూసిన ఆ సీన్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆ సినిమా ఎదో కాదు టాలీవుడ్ లో ఎవరు గ్రీన్ గా నిలిచిన వెంకీ సినిమా సీన్. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో ఈ సినిమా వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఈ సినిమాలో కామెడీని ప్రేక్షకులు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైన్ సీన్.

Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే

వెంకీ సినిమా విడుదలై 22ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా చాలా మంది ఫేవరెట్ సినిమానే.. సినిమాలో ముఖ్యంగా బ్రహ్మానందం ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. బ్రహ్మానందం రవితేజ కాంబినేషన్ లో వచ్చే ఈ సీన్ థియేటర్స్ లో బ్లాస్ట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా రీరిలీజ్ అయ్యింది. ఆసమయంలో థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. బ్రహ్మానందం సీన్స్ కు థియేటర్స్ లో ఈలలు, గోలలతో రచ్చ రచ్చ చేశారు. ఎప్పటికీ  ఈ సీన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us