AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హ్యాపీడేస్‌’లో టైసన్‌ లవర్‌ గుర్తుందా? యూత్‌ను కట్టిపడేసిన ఈ కర్లీ బ్యూటీ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

సోనియాది హైదరాబాదే. ఇక్కడే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక ఐటీ సంస్థలో మూడేళ్ల పాటు సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసింది. అయితే ఒక ప్రమోషన్‌ ఈవెంట్‌లో సోనియాను చూసిన శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌లో స్రవంతి పాత్రకు సెలెక్ట్‌ చూశారు.

'హ్యాపీడేస్‌'లో టైసన్‌ లవర్‌ గుర్తుందా? యూత్‌ను కట్టిపడేసిన ఈ కర్లీ బ్యూటీ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Happydays Movie
Basha Shek
|

Updated on: Apr 27, 2023 | 3:30 PM

Share

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ హ్యాపీడేస్‌. 2007లో విడుదలైన ఈ చిత్రం యువతను తెగ ఆకట్టుకుంది. సినిమాలో అందరూ కొత్త వాళ్లైనప్పటికీ బాగా కనెక్ట్‌ అయిపోయారు. వరుణ్‌ సందేశ్‌, మిల్కీ బ్యూటీ తమన్నాలకు హ్యాపీడేస్‌ మూవీ మంచి బ్రేక్‌ ఇచ్చింది. కాగా ఈ సినిమాలో చాలామందిని ఆకట్టుకున్న మరో జోడి టైసన్‌ (రాహుల్‌) అతని లవర్‌ శ్రావ్స్‌ (సోనియా దీప్తి). ముఖ్యంగా ఆమె రింగురింగుల జుట్టు (కర్లీ హెయిర్‌)కు చాలామంది ఫ్యాన్స్‌ అయిపోయారు. అలాగే సోనియా వాయిస్‌ కూడా యూత్‌ను కట్టిపడేసింది. అన్నట్లు సోనియాది హైదరాబాదే. ఇక్కడే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక ఐటీ సంస్థలో మూడేళ్ల పాటు సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసింది. అయితే ఒక ప్రమోషన్‌ ఈవెంట్‌లో సోనియాను చూసిన శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌లో స్రవంతి పాత్రకు సెలెక్ట్‌ చూశారు. అనుకున్నట్లే సినిమా కూడా హిట్‌ అయ్యింది. సోనియాకు మంచి పేరొచ్చింది. అలాగే బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారం అందుకుంది. హ్యాపీడేస్‌ తర్వాత సోనియాకు హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. వినాయకుడు, బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అలాగే ఆవారా, దూకుడు సినిమాల్లో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా కీ రోల్స్‌ పోషించింది.

తెలుగుతో పాటు కన్నడ, కొన్ని మలయాళ సినిమాల్లోనూ నటించింది సోనియా. అయితే సడెన్‌గా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైంది. 2016లో చిన్ని చిన్నీ ఆశలు నాలో రేగేనే అనే తెలుగు సినిమాలో చివరిగా నటించింది. 2017లో ఓ తమిళ సినిమాలోనూ కనిపించింది. ఆతర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించలేదు. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సినిమాల్లో కనిపించకపోయినా కొన్ని సామాజిక కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తోంది సోనియా. మహిళా సాధికారత, మోరల్‌ పోలీసింగ్‌లకు సంబంధించి ఆమె రిలీజ్‌ చేసిన షార్ట్‌ ఫిలిమ్స్‌కు మంచి పేరొచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ వెండితెరపై అడుగుపెట్టేందుకు సోనియా సిద్ధమవుతోంది. అనుష్క, నవీన్‌ పొలిశెట్టి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

సోనియా లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

Follow Us