Telangana: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గు లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం.. భద్రాచలం నుంచి వెళ్తుండగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత వేగంతో వస్తున్న బొగ్గు టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో చాలామంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత వేగంతో వస్తున్న బొగ్గు టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో చాలామంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదం ఆదివారం ఉదయం.. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం ఆనందగని సమీపంలో జరిగింది. భద్రాచలం నుంచి గుంటూరు వెళుతున్న బస్సును.. ఆనందగని వద్ద బొగ్గు లారీ బలంగా ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయని.. వీరిలో ఐదుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరికొందరికీ స్వల్ప గాయాలయ్యాయి.
టీఆఎస్ ఆర్టీసీ బస్సు.. భద్రాచలం నుంచి గుంటూరు పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారని.. పేర్కొన్నారు. బొగ్గు లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెం, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..