JEE Main 2023 Toppers: జేఈఈ మెయిన్‌ ర్యాంకుల్లో ‘టాప్‌’ లేపిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.. నేటి నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు

జేఈఈ మెయిన్స్‌ 2023 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జనవరి, ఏప్రిల్‌లలో జరిగిన జేఈఈ మెయిన్‌ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని శనివారం తెల్లవారుజామున జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ర్యాంకుల్ని ప్రకటించింది. ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు..

JEE Main 2023 Toppers: జేఈఈ మెయిన్‌ ర్యాంకుల్లో 'టాప్‌' లేపిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.. నేటి నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు
Venkat Koundinya And Lohit Aditya
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 30, 2023 | 8:15 AM

జేఈఈ మెయిన్స్‌ 2023 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జనవరి, ఏప్రిల్‌లలో జరిగిన జేఈఈ మెయిన్‌ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని శనివారం తెల్లవారుజామున జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ర్యాంకుల్ని ప్రకటించింది. ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఫస్ట్, సెకండ్‌ ర్యాంకులతోపాటు, తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులే దక్కించుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్‌కౌండిన్య 300కు 300 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. నెల్లూరుకు చెందిన పునుమల్లి లోహిత్‌ ఆదిత్యసాయి సైతం 300 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో చదివిన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన సాయిదుర్గారెడ్డి 6వ ర్యాంకు, హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తిచేసిన అమలాపురానికి చెందిన కల్లకూరి సాయినాథ్‌ శ్రీమంత్‌ 10వ ర్యాంకు సాధించారు. అలానే వావిలాల చిద్విలాస్‌రెడ్డి 15, బిక్కిన అభినవ్‌చౌదరి 16వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన పొంగూరు భాను దివ్యాంగుల విభాగంలో 8వ ర్యాంకు సాధించాడు.100లోపు ర్యాంకుల్లో 30కిపైగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సాధించారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ రెండు విడతల్లో మొత్తం 43 మంది 100 పర్సంటైల్‌ సాధించగా… వారిలో ఏపీ, తెలంగాణ నుంచి 16 మంది ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 11 మంది ఉండడం విశేషం. రెండు విడతల పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 11,13,325 మంది పరీక్షలు రాశారు. వారిలో అమ్మాయిలు 3,38,963 మంది ఉన్నారు.

పెరిగిన కటాఫ్‌ స్కోర్‌ ఇలా..

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించేందుకు, అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు ఈసారి కటాఫ్‌ స్కోర్‌ పెరిగింది. అతి తక్కువగా జనరల్‌ కేటగిరీలో, ఎక్కువగా ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో కటాఫ్‌ పెరిగినట్లు స్పష్టమవుతోంది. కోవిడ్‌ తర్వాత ప్రత్యక్ష తరగతులు జరగడంతో విద్యార్థుల మధ్య పోటీపెరిగి కటాఫ్‌ పెరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జేఈఈ ఫలితాల వెల్లడి విషయంలో ఈసారి కూడా ఎన్‌టీఏ తీరు మారలేదు. ఈ నెల 24న పరీక్షల తుది కీని వెల్లడించిన ఆ సంస్థ గత 4 రోజులుగా స్కోర్‌ కార్డులు, ర్యాంకుల్ని ప్రకటించకుండా లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులను ఉత్కంఠకు గురిచేసింది. ర్యాంకులు ఎప్పుడు ప్రకటిస్తామనేది కూడా ఎన్‌టీఏ ప్రకటించలేదు. ఎట్టకేలకు శనివారం తెల్లవారుజామున ఫలితాలను విడుదల చేసింది. ఎట్టకేలకు శనివారం ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ అర్హత సాధించినవారు ఈ రోజు నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది. ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకుని, దాని ఆధారంగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి

కేటగిరీల వారీగా కటాఫ్‌ ఇదీ..

  • కేటగిరీ                  కటాఫ్‌             ఎంపికైన అభ్యర్థుల సంఖ్య

    ఓపెన్‌                    90.788642                     98,612 పీహెచ్‌                  0.0013527                     2,685 ఈడబ్ల్యూఎస్‌        75.6229025                 25,057 ఓబీసీ                    73.6114227                   67,613 ఎస్సీ                     51.9776027                   37,536 ఎస్టీ                        37.2348772                  18,752

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.