Mother – Daughter Body: కూతురు మృతదేహంతో 5 రోజుల పాటు..! తల్లి సావాసం.. వీడియో.
పశ్చిమ బెంగాల్‌లో హృదయ విదారకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలోని తన కుమార్తె మృతదేహంతో ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయింది ఓ తల్లి. మృతురాలిని 32 ఏళ్ల సంచిత బసుగా గుర్తించారు పోలీసులు. దక్షిణ కోల్‌కతాలోని రాణికుతిలోని తమ నివాసంలో కుమార్తె మృతదేహంతో ఉన్న
పశ్చిమ బెంగాల్‌లో హృదయ విదారకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలోని తన కుమార్తె మృతదేహంతో ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయింది ఓ తల్లి. మృతురాలిని 32 ఏళ్ల సంచిత బసుగా గుర్తించారు పోలీసులు. దక్షిణ కోల్‌కతాలోని రాణికుతిలోని తమ నివాసంలో కుమార్తె మృతదేహంతో ఉన్న మానసిక వికలాంగులైన ఆమె తల్లి దిపాలి బసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను చికిత్స కోసం కలకత్తా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. కోల్‌కతా నగరం బిజోయ్‌ఘర్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులోని ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తోందని ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తలుపులు బద్దలుకొట్టి చూడగా.. వృద్ధురాలు దిపాలి బసు తన కుమార్తె సంచిత బసు మృతదేహం పక్కన కూర్చొని ఉన్నట్లు గుర్తించారు. సంచిత బసు తన తల్లితో కలిసి నివసిస్తోంది. ఇద్దరికీ మానసిక రుగ్మత ఉందని పోలీసులు తెలిపారు. తల్లీకూతుళ్లకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని, వారి బంధువుల్లో ఒకరు వారికి ఆహారం పంపేవారని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!