కుప్పకూలిన గోడౌన్.. ముగ్గురు మృతి, 12 మందికి తీవ్రగాయాలు ’15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం’
మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో శనివారం (ఏప్రిల్ 29) రెండంతస్తుల గోడౌన్ కూలిపోయింది. ఈ ఘటనలో నాలుగున్నర ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 12 మందిని రెస్క్యూ టీం రక్షించింది. శిథిలాల మధ్య ఇంకా 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్తే..
మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో శనివారం (ఏప్రిల్ 29) రెండంతస్తుల గోడౌన్ కూలిపోయింది. ఈ ఘటనలో నాలుగున్నర ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 12 మందిని రెస్క్యూ టీం రక్షించింది. శిథిలాల మధ్య ఇంకా 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్తే..
భివాండి సమీపంలోని వర్ధమాన్ కాంపౌండ్‌లోని రెండంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కూలిపోయినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి అవినాష్ సావంత్ తెలిపారు. భవనం పై అంతస్తులో నాలుగు కుటుంబాలు నివసిస్తుండగా కింది భాగంలో కూలీలు పనిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. సోనా ముఖేస్ ఖోరి నాలుగున్నర ఏళ్ల చిన్నారి, నవ్‌నథ్ సావత్ (35), లక్ష్మిదేవ్ రవి మహతవ్ (26) అనే ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. 12 మంది క్షతగాత్రులను రక్షించారు.
#WATCH| Maharashtra: A building has collapsed in Bhiwandi, and 9 people rescued so far. Operations underway: Thane Municipal Corporation
(Video source – Thane Municipal Corporation) pic.twitter.com/6jWM6jItqt
— ANI Digital (@ani_digital) April 29, 2023
శిథిలాల కింద మరో పది మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో సహా వివిధ ఏజెన్సీల సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గత ఎనిమిది గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అవినాష్ సావంత్ తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం, క్షతగాత్రుల చికిత్స ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.