Exploding Phones: మీ స్మార్ట్‌ఫోన్లలో ఈ మార్పులు గమనించారా? లేదంటే ఏ క్షణానైనా పేలిపోతాయ్..

ఇటీవల కేరళకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి స్మార్ట్‌ఫోన్‌ పేలి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న కేసులు ఇబ్బడిముబ్బడిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ల రూపంలో జేబులో బాంబు పెట్టుకు తిరుగుతున్నామేమోననే సందేహం కూడా లేకపోలేదు. దీంతో అవి ఎప్పుడు పేలిపోతాయో తెలియక సామాన్యులు..

Exploding Phones: మీ స్మార్ట్‌ఫోన్లలో ఈ మార్పులు గమనించారా? లేదంటే ఏ క్షణానైనా పేలిపోతాయ్..
Exploding Phones
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 30, 2023 | 9:32 AM

ఇటీవల కేరళకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి స్మార్ట్‌ఫోన్‌ పేలి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న కేసులు ఇబ్బడిముబ్బడిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ల రూపంలో జేబులో బాంబు పెట్టుకు తిరుగుతున్నామేమోననే సందేహం కూడా లేకపోలేదు. దీంతో అవి ఎప్పుడు పేలిపోతాయో తెలియక సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

నిజానికి స్మార్ట్‌ఫోన్లు పేలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అసలు స్మార్ట్‌ఫోన్లు ఎందుకు పేలుతున్నాయో.. దాని వెనుక అసలు కారణం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. స్మార్ట్‌ఫోన్లు అప్పుడప్పుడు కిందపడిపోవడం సాధారణం. ఇలా కిందపడిపోయినప్పుడు ఫోన్‌లోని బ్యాటరీలోని కొన్ని ముఖ్యమైన పరికరాలు దెబ్బతినడం వల్ల అవి ఉబ్బడం ప్రారంభమవుతాయి. ఇలా ఉబ్బిన బ్యాటరీలను వెంటనే ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేసి, సమీపంలోని సర్విస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. లేదంటే అవి ఏ సమయంలో అయినా పేలిపోయే ప్రమాదం ఉంది.

అలాగే ఫోన్‌ బ్యాటరీలలో ఉపయోగించే రసాయనాలు ఎక్కువ వేడికి గురైతే పేలిపోతాయి. వేడిగా ఉండే పరిసర ప్రాంతాల్లో ఛార్జింగ్‌ పెట్టినా బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది. ఛార్జింగ్ పెట్టి ఫోన్‌ మాట్లాడినా.. రాత్రంగా ఓవర్‌ఛార్జ్‌ చేసినా బ్యాటరీలు పేలిపోతాయి. ఎంత ఎక్కువ సమయం ఛార్జ్‌ చేస్తే బ్యాటరీ అంత త్వరగా పాడైపోతుందన్నమాట. 30 నుంచి 80 శాతం మధ్య ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి.

ఇవి కూడా చదవండి

కొన్ని సందర్భాల్లో సాంకేతి సమస్యల వల్ల కూడా ఫోన్లు పేలిపోతుంటాయి. అలాగే అన్‌సర్టిఫైడ్ చార్జర్లు కూడా ఫోన్‌ పేలుళ్లకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బ్యాటరీని సంరక్షించే ఫీచర్లను ఉపయోగించడం ద్వారా ఫోన్‌ టెంపరేచర్‌ను అదుపు చేయవచ్చు. అలాగే ఎండలో ఫోన్ కెమెరా ఉపయోగించకపోవడం బెటర్‌.

మరిన్ని టెక్నాలజీ సంబంధిత వార్తా కథనాల కోసం క్లిక్‌ చేయండి.