JR NTR: లైపోనా లేక ఓజెంపిక్..? వెయిట్ లాస్పై ఎన్టీఆర్ టీం క్లారిటీ..!
దుబాయ్ టూర్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ పిక్లో బక్కచిక్కిపోయిన ఎన్టీఆర్‌ను చూసి ఫ్యాన్స్‌తో పాటు అందరూ షాక్‌కు గురయ్యారు. దీంతో తారక్ ఆరోగ్య పరిస్థితిపైనా ఆనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఓజెంపిక్ చికిత్స తీసుకోవడమే సన్నబడేందుకు కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ నిజంగానే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా..? అసలు ఓజెంపిక్ అంటే ఏంటి..? ఎన్టీఆర్ ఓజెంపిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదట. ఎన్టీఆర్ ఓజెంపిక్ చికిత్స తీసుకోవడం లేదని ఆయన టీం స్పష్టం చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NTR 31 మూవీ కోసం తారక్ బక్కచిక్కారని చెబుతోంది. ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడని, ఫిట్ నెస్ కోసం ఫిబ్రవరి నుంచి కొత్త డైట్ ఫాలో అవుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ బరువుపై ఇలాంటి వదంతులు రావడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో రాఖీ మూవీ తర్వాత ఆయన భారీగా బరువు తగ్గి స్లిమ్ గా తయారయ్యాయి. దీంతో అప్పట్లో తారక్ లైపోసక్షన్ చేయించుకున్నారని ఊహాగానాలు రావడంతో అప్పట్లో తారక్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి పుకార్లే వస్తుండటంతో ఆయన టీం స్పష్టతనిచ్చింది. తాజాగా ఎన్టీఆర్ బరువు తగ్గడంపై అతని సోదరుడు కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. తారక్ ఏం చేసినా సినిమా కోసమేనని క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థాయ్ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన స్కూల్ పిల్లలు
జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్.. ఇప్పుడు ఎగరేయండి కాలర్
ఏడుపు ఆపని బిడ్డ… కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్
Samantha: సమంతకు అమెజాన్ ప్రైమ్ బిగ్ ఝలక్.. అభిమానులకి ఊహించని షాక్
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

