ఏడుపు ఆపని బిడ్డ… కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్
గుజరాత్‌లో ఓ మహిళ మూడు నెలల కిందట బాబుకు జన్మనిచ్చింది. అయితే పసివాడు ఎందుకో గానీ పుట్టినప్పటి నుంచి నిరంతరం ఏడుస్తుండేవాడు. తల్లిగా బిడ్డ బాధను అర్ధం చేసుకుని తీర్చడానికి బదులు ఆమె పిల్లాడి ఏడ్పుతో విసిగిపోయింది. దీంతో ఏప్రిల్ 5న అండర్ గ్రౌండ్‌లో ఉన్న నీటి సంపులో బాబును పడేసి ఏమీ తెలియనట్లు మూత పెట్టేసి చేతులు దులుపుకుంది.
దీంతో బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. నవమాసాలు మోసిన కన్నతల్లే ఈ దారుణానికి పాల్పడటంతో అంతా విస్తుపోతున్నారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏప్రిల్ 9న జరిగింది. మూడు నెలల కుమారుడు ఖాయల్ కనిపించడం లేదని కరిష్మా నానా హడావుడి చేసింది. అనంతరం ఏమీ ఎరగనట్లు దొంగనాటకాలు ఆడింది. ఆమె ఏడుపు చూడలేక భర్త దిలీప్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో అసలు సంగతి తేలడంతో చివరకు కరిష్మాను అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో కరిష్మాను ప్రశ్నించగా పిల్లాడిని ఇంట్లో ఉంచి స్నానానికి వెళ్లానని, తిరిగొచ్చేటప్పటికీ మాయమైనట్లు తెల్పింది. దీంతో పోలీసులు మహిళ ఇంటి పరిసర ప్రాంతాల్లో గాలించగా.. వారి ఇంటి నీటి సంపులో శిశువు మృతదేహం లభ్యమైంది. ట్యాంక్ నిర్మాణం బట్టి చూస్తే ప్రమాదవశాత్తు శిశువు అక్కడకు చేరుకోవడం దాదాపు అసాధ్యమని భావించిన పోలీసులు నిందితురాలు కరిష్మానే అని తేల్చారు. దర్యాప్తులో సంపులో పడేసింది తల్లి కరిష్మానే అని తెలుసుకుని విస్తుపోయారు. దీంతో ఆమెను అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్
Samantha: సమంతకు అమెజాన్ ప్రైమ్ బిగ్ ఝలక్.. అభిమానులకి ఊహించని షాక్
Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువెంతో తెలుసా..? కార్ల లిస్టు చూస్తే మైండ్ బ్లాంక్
జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో..
జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం
రెచ్చిపోయిన రోడ్‌సైడ్ రోమియోలు..
దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..
జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో
పాపం.. గోల్డ్ అనుకొని స్కెచ్ వేశారు.. చివరికి..
ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

