Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువెంతో తెలుసా..? కార్ల లిస్టు చూస్తే మైండ్ బ్లాంక్
మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన నటనతో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా మారాడు రామ్ చరణ్. చిరంజీవి కొడుకుగా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చిరుతగా బరిలోకి దిగి.. రెండో సినిమా మగధీరతో హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ కూడగట్టిన రామ్ చరణ్.. బాగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రామ్ చరణ్ కు పెద్ద బంగ్లా ఉంది. దాని విలువ 50కోట్లకు పైనేనని అంచనా. రామ్ చరణ్ వద్ద పలు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఆయన గ్యారేజీలో మెర్సిడెజ్, రోల్స్ రాయిస్ ఫాంథమ్, ఫెరారీ, ఆస్టో మార్టిన్ కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లే కావడం విశేషం. రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ 13వందల 70 కోట్లపైనే ఉంటుందని అంచనా. రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. ఆయన ఒక్కో యాడ్ కు 2 నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన రామ్ చరణ్ నిర్మాతగా మారారు. మరోవైపు రామ్ చరణ్ ట్రూజెట్ అనే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ను కూడా నడిపిస్తున్నారు. చెర్రీ దగ్గర ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఫ్యామిలీ టూర్స్, సినిమా ఈవెంట్స్ వెళ్లేందుకు దాన్ని ఉపయోగిస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

