AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron Milk: వేడి వేడి పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

రాత్రి వేళ పాలు జీర్ణమవడం కష్టం. అందుకే ఉదయం వేళ తాగితే మంచిది. మీ శరీర స్వభావాన్ని బట్టి ఎప్పుడు తాగాలా నిర్ణయించుకోవచ్చు. చల్లని పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే చర్మంపై నిగారింపు వస్తుంది. మెదడుకు కూడా మంచిది. తరచూ ఇలా కుంకుమ పువ్వు పాలు తీసుకోవటం వల్ల శరీరానికి చలువచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వేడి పాలలో కుంకుమ పూలు కలిపి తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Saffron Milk: వేడి వేడి పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
Saffron Milk
Jyothi Gadda
|

Updated on: Apr 18, 2025 | 9:41 PM

Share

వివిధ రకాల సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు చాలా ఖరీదైంది. ఇది రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. కుంకుమ పూవు వాసన కొద్దిగా తీయగా, ఘాటుగా ఉంటుంది. కొద్దిగా చేదు కూడా ఉంటుంది. ఇందులో కేలరీలతో పాటు ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే చాలా మంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, కుంకుమ పువ్వు కలిపేందుకు వేడి పాలు తీసుకోవాలా..? లేదంటే చల్లటి పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే ఏమౌతుందో తెలుసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. వేసవిలో కుంకుమ పాలు తాగవచ్చా లేదా అనేది తెలుసుకుందాం

కుంకుమ పువ్వు పాలతో పోషక విలువలు పెరుగుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. శరీరానికి అంతర్గతంగా బలం చేకూరుతుందని చెబుతారు. కుంకుమ పువ్వు చర్మ సంరక్షణకు చాలా మంచిది. పాలలో కలుపుకుని తాగుతుంటారు. జలుబు దగ్గు సమస్య ఉంటే వేసవిలో కూడా కుంకుమ పాలు తాగవచ్చు. అయితే కుంకుమ పువ్వును ఎప్పుడూ చల్లనిపాలలోనే కలిపి తాగాలి. వేడి పాలలో కలిపి తాగితే ఎసిడిటీ సమస్య రావచ్చు

రాత్రి వేళ పాలు జీర్ణమవడం కష్టం. అందుకే ఉదయం వేళ తాగితే మంచిది. మీ శరీర స్వభావాన్ని బట్టి ఎప్పుడు తాగాలా నిర్ణయించుకోవచ్చు. చల్లని పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే చర్మంపై నిగారింపు వస్తుంది. మెదడుకు కూడా మంచిది. తరచూ ఇలా కుంకుమ పువ్వు పాలు తీసుకోవటం వల్ల శరీరానికి చలువచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వేడి పాలలో కుంకుమ పూలు కలిపి తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కాస్త గోరువెచ్చగా, లేదంటే చల్లటి పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌