AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మద్యం మత్తులో తూలుతూ రోడ్డుపై పడిపోయిన రైఫిల్‌ ఉన్న పోలీస్…. తర్వాత ఏం జరిగిందంటే?

వైరల్‌ వీడియోలో యూనిఫాం ధరించిన ఒక పోలీస్‌ వద్ద సర్వీస్‌ రైఫిల్‌ కూడా వెంట ఉండగా అతడు మద్యం మత్తులో తూలుతూ రద్దీగా ఉన్న రోడ్డుపై పడ్డాడు. పైకి లేచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. ఆ పోలీస్‌ వద్ద రైఫిల్‌ ఉండటంతో ఆయనతోపాటు ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరుగవచ్చని అక్కడున్న జనం భయాందోళన చెందారు. వెంటనే..అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ స్పందించాడు.

Watch: మద్యం మత్తులో తూలుతూ రోడ్డుపై పడిపోయిన రైఫిల్‌ ఉన్న పోలీస్.... తర్వాత ఏం జరిగిందంటే?
Drunk Cop
Jyothi Gadda
|

Updated on: Apr 18, 2025 | 7:41 PM

Share

ప్రజల్ని కాపాడాల్సిన ఖాకీలే తప్పుదోవ పడుతున్నారు. మద్యం మత్తులో తులూతూ ఓ పోలీసు కానిస్టేబుల్ నడి రోడ్డుపై పడిపోయిన సంఘటన అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఒక పోలీసు కానిస్టేబుల్ మద్యం మత్తులో రైఫిల్ పట్టుకుని రోడ్డుపై తూలుతూ కనిపించాడు. అది గమనించిన స్థానికులు, వాహనదారులు ఆ కానిస్టేబుల్‌ను పైకి లేపి పక్కన కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే, ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ మద్యం మత్తులో రోడ్డుపై తూలిపడ్డాడు. రైఫిల్‌తో ఉన్న ఆ పోలీస్‌ను చూసి అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. కొందరు అతన్ని వీడియోలు తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో యూనిఫాం ధరించిన ఒక పోలీస్‌ వద్ద సర్వీస్‌ రైఫిల్‌ కూడా వెంట ఉండగా అతడు మద్యం మత్తులో తూలుతూ రద్దీగా ఉన్న రోడ్డుపై పడ్డాడు. పైకి లేచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. ఆ పోలీస్‌ వద్ద రైఫిల్‌ ఉండటంతో ఆయనతోపాటు ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరుగవచ్చని అక్కడున్న జనం భయాందోళన చెందారు. వెంటనే..అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ స్పందించాడు. రైఫిల్‌ కలిగి మద్యం మత్తులో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ని పైకిలేపి రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు.

వీడియో ఇక్కడ చూడండి..

కాగా, ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో బిజ్నోర్ పోలీస్ శాఖ దీనిపై స్పందించింది. ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ చర్యలు చేపట్టినట్లు ఎక్స్‌లో పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా