AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూడలే.. బదిలీపై వెళ్తున్న పోలీసు ఆఫీసర్‌కు ఊరి జనం వీడ్కోలు..

బదిలీపై వెళ్తున్న పోలీస్‌ ఆఫీస్‌ వినోద్‌ కుమార్‌ను స్థానికులు పూలతో సత్కరించారు. గుర్రాలు, డ్రమ్స్‌, మేళతాళాలతో అతన్ని ఊరేగించారు. గుర్రాలతో ర్యాలీ నిర్వహించారు. భారీ ఊరేగింపుతో అతడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. స్థానికులంతా చుట్టూ కదిలారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Viral Video: ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూడలే.. బదిలీపై వెళ్తున్న పోలీసు ఆఫీసర్‌కు ఊరి జనం వీడ్కోలు..
Grand Farewell For Up Cop
Jyothi Gadda
|

Updated on: Apr 18, 2025 | 7:16 PM

Share

సాధారణంగా ఒక ఉద్యోగి ఒకచోటు నుంచి మరో చోటుకు బదిలీ పై వెళ్తుంటారు. తోటి ఉద్యోగులంతా వారికి ఫేర్‌వెల్‌ పార్టీ చేస్తుంటారు. బదిలీపై వెళ్తున్న అధికారిని ఘనంగా సత్కరిస్తారు. తోచిన బహుమతులు ఇచ్చి వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఇలాంటి ఫేర్‌వెల్‌ పార్టీలు ఎక్కువగా స్కూల్‌ టీచర్లకు విభిన్న రీతిలో నిర్వహిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చూస్తుంటాం.. అయితే, ఓ పోలీసు ఆఫీసర్‌ బదిలీపై వెళ్తుంటే అక్కడి స్థానికులు అతనికి ఊహించని రీతిలో వీడ్కోలు పలికారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఫేర్‌వెల్‌ పార్టీకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

వైరల్‌ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాకు చెందినదిగా తెలిసింది. జిల్లాలోని మదన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ వినోద్‌ కుమార్‌ సింగ్‌ ఆరు నెలల పదవీకాలం ముగిసిన తర్వాత అతన్ని అధికారులు వేరే చోటుకి బదిలీ చేశారు. అయితే, అతని పనితీరుతో స్థానికులకు బాగా దగ్గరయ్యారు వినోద్‌ కుమార్‌ సింగ్‌. దీంతో అతడు ట్రాన్స్‌ఫర్‌పై వెళ్తుంటే స్థానిక ప్రజలు తట్టుకోలేకపోయారు. భావోద్వేగానికి గురయ్యారు. స్థానికులంతా కలిసి ఆ పోలీస్‌ ఆఫీసర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

బదిలీపై వెళ్తున్న పోలీస్‌ ఆఫీస్‌ వినోద్‌ కుమార్‌ను స్థానికులు పూలతో సత్కరించారు. గుర్రాలు, డ్రమ్స్‌, మేళతాళాలతో అతన్ని ఊరేగించారు. గుర్రాలతో ర్యాలీ నిర్వహించారు. భారీ ఊరేగింపుతో అతడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. స్థానికులంతా చుట్టూ కదిలారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా