Watch: బతుకమ్మ కుంటలో చేపల వేట.. పట్టినోళ్లకు పట్టినన్ని.. పండగే పండగ..
వాకింగ్ కి వచ్చిన వాళ్లకు చేపలు పైన తేలియాడుతూ కనిపించాయి. చెరువు నిండుగా చేపలు పై పైనే కనిపించటంతో జనాలు ఆగుతారా..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కుంటలోకి దిగి చేపలు పట్టే పనిలో మునిగిపోయారు. పట్టుకున్న వాళ్లు పట్టినన్నీ చేపలు ఇంటికి మోసుకెళ్లి చేపల పండగ చేసుకున్నారు.

జనగాం జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో వాకర్స్ చేపల వేటలో నిమగ్నమయ్యారు. బతుకమ్మ కుంటలో నీటిమట్టం అడుగంటడంతో వాకింగ్ కి వచ్చిన వాళ్లకు చేపలు పైన తేలియాడుతూ కనిపించాయి. చెరువు నిండుగా చేపలు పై పైనే కనిపించటంతో జనాలు ఆగుతారా..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కుంటలోకి దిగి చేపలు పట్టే పనిలో మునిగిపోయారు. పట్టుకున్న వాళ్లు పట్టినన్నీ చేపలు ఇంటికి మోసుకెళ్లి చేపల పండగ చేసుకున్నారు.
అయితే, గత కొన్నేళ్లుగా ఇక్కడి బతుకమ్మ కుంటలో వలల సాయంతోనే చేపలు పట్టేవారు. కానీ ఈ ఏడాది నీటిమట్టం అడుగంటడంతో చేపలు ఈజీగా పైకి దర్శనమిస్తున్నాయి. దాంతో అటుగా వచ్చిన వాకర్స్, స్థానికులు చెరువులోకి దిగి ఈజీగా చేపలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బతుకమ్మ కుంట నీటిమట్టం అడుగంటడం చూస్తే.. జనగాం జిల్లాలోని భూగర్భ జలాలు అడుగంటడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓవైపు అధికారులు మరోవైపు పాలకుల నిర్లక్ష్యంతో ఈ కుంట పూర్తిగా అడుగంటిపోయిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ కుంటలో చేపలు వేసిన వ్యాపారికి ఇది మాత్రం ఇది తీరని నష్టం తెచ్చిపెట్టింది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చేతికొచ్చిన పంట దూరమైందంటూ ఇక్కడి చేపల వ్యాపారులు వాపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




