Viral Video: విమానం హైజాక్ కు యత్నించిన ప్రయాణికుడు… తుపాకీతో దుండగుడిని షూట్ చేసిన మరో ప్రయాణికుడు
విమానం గాల్లో ఎగురుతుండగా ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న కత్తి బయటకు తీశాడు. విమానాన్ని దారి మళ్లించాలని బెదిరింపులకు దిగాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆపేందుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. పలువురిపై దాడి కూడా చేసాడు. అదంతా చూసి ఊరుకోలేదు ఓ ప్రయాణికుడు. ఉన్నట్టుండి తన వద్దనున్న...

విమానం గాల్లో ఎగురుతుండగా ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న కత్తి బయటకు తీశాడు. విమానాన్ని దారి మళ్లించాలని బెదిరింపులకు దిగాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆపేందుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. పలువురిపై దాడి కూడా చేసాడు. అదంతా చూసి ఊరుకోలేదు ఓ ప్రయాణికుడు. ఉన్నట్టుండి తన వద్దనున్న లైసెన్స్డ్ గన్ తీసి అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ట్రాఫిక్ ఎయిర్‌కు చెందిన ఓ చిన్న విమానం గురువారం మెక్సికోలోని కొరొజాల్ నుంచి శాన్ పెడ్రోకు బయలు దేరింది. మొత్తంగా 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తోటి ప్రయాణికులను బెదిరిస్తూ.. విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు చెప్పాడు. పలువరిపై కత్తితో దాడికి కూడా పాల్పడ్డాడు. దాదాపు రెండు గంటల పాటు విమానాన్ని అక్కడక్కడే చక్కర్లు కొట్టించాడు. ఇక చేసేదేమీ లేక సిబ్బంది కూడా విమానాన్ని అతడు చెప్పిన చోటుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే హఠాత్తుగా ఓ ప్రయాణికుడు తన వద్దనున్న లైసెన్స్డ్ తుపాకీ తీసి దుండగుడిపై కాల్పులు జరిపాడు. అతడిని చంపాలనే ఉద్దేశంతో కాకుండా ఆపాలని కాల్పులు జరిపినప్పటికీ.. శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోగా నిందితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా రక్తస్రావం కూడా అయింది. అయితే రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన ప్రయాణికులు దగ్గరకు వెళ్లి చూడగా అతడు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ముఖ్యంగా విమానం ల్యాండ్ అయిన వెంటనే బెలీజ్ అధికారులు అతడిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
హైజాక్‌కు యత్నించి ప్రాణాలు కోల్పోయిన నిందుతుడు అమెరికా వాసి అని… అతడి పేరు అకిన్యేలా సావా టేలర్ అని అధికారులు తెఇపారు. అయితే అతడు కత్తిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడనేది మాత్రం ఇంకా తెలియలేదని.. దానిపై దర్యాప్తు సాగిస్తున్నామని వివరించారు. మరోవైపు దుండగుడిపై కాల్పులు జరిపి.. తోటి వారి ప్రాణాలు కాపాడిన ప్రయాణికుడిని హీరోగా అభివర్ణించారు. ఆయన చాకచక్యంగా వ్యవహరించడం వల్లే వారంతా బతికి బయట పడ్డారని అన్నారు. నిందితుడు ఒక్కడే ఇదంతా చేశాడా, అతడి వెనుక మరెవరైనా ఉన్నారా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
వీడియో చూడండి:
🚨🇧🇿#BREAKING | NEWS⚠️ A US citizen hijacks a tropic airplane (V3HHG) with 13 passengers aboard it was hijacked by a man with a knife and injured three. When the plane landed at the Philip Goldson international Airport in Belize, he was met with dozens of police all the… pic.twitter.com/gtb4wOqVZl
— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) April 17, 2025
