Viral Video: పూల్‌లో ఈత కొడుతున్న గబ్బిలం… వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
గబ్బిలం ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గబ్బిలాలు సాధారణంగా మానవ సమూహానికి దూరంగా నివసిస్తాయి. ఎక్కువగా అడవులు, పాడుబడ్డ భవనాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. గబ్బిలాలు ఎగరడానికి ఎక్కువ శక్తి అవసరం. అందుకోసం అవి ఎక్కువ తీపి, ప్రొటీన్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. తమ ఆకలిని తీర్చుకోవడానికి పండ్లు, పూల రసాలు, కీటకాలను...

గబ్బిలం ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గబ్బిలాలు సాధారణంగా మానవ సమూహానికి దూరంగా నివసిస్తాయి. ఎక్కువగా అడవులు, పాడుబడ్డ భవనాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. గబ్బిలాలు ఎగరడానికి ఎక్కువ శక్తి అవసరం. అందుకోసం అవి ఎక్కువ తీపి, ప్రొటీన్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. తమ ఆకలిని తీర్చుకోవడానికి పండ్లు, పూల రసాలు, కీటకాలను తింటాయి. ముఖ్యంగా గబ్బిలాలు కొరికిన పండ్లను మనుషులు తీసుకోవడం, అందులోని లాలాజలం ద్వారా వివిధ రకాల వైరస్‌లు మనుషులకు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా గబ్బిలాలన్నీ దాదాపు ఒకే సమూహంలో నివసించడం వల్ల ఒకదాని నుంచి మరొకరికి వేగంగా వైరస్‌లు వ్యాపిస్తాయి. ఈ కారణం వల్లనే మనుషులు ఎక్కువగా వివిధ రకాల వైరస్ ల బారిన పడుతున్నారట. గతంలో కేరళలో నిపా వైరస్ అల్లకల్లోలం సృష్టించినప్పుడు పండ్లు తినకండని సూచించడం గబ్బిలాలు ఎలా వైరస్‌లు వ్యాప్తి చేస్తాయో ప్రత్యక్ష నిదర్శనం. రాత్రుళ్లు ఆహార వేటలో ఉండే గబ్బిలాలు తెల్లారేసరికి తిరిగి చెట్ల వద్దకు చేరుకుంటాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని రకాల పనులను అశుభంగా పరిగణిస్తుంటాం. ఇలాంటి వాటిలో ఒకటి గబ్బిలాలు ఇంట్లోకి రావడం. గబ్బిలం ఒకవేళ ఇంట్లోకి వస్తే అశుభంగా భావిస్తుంటారు. నిజానికి గబ్బిలాలు పెద్దగా జనావసాల్లో కనిపించవు. దేవాలయాల దగ్గర లేదా పెద్ద పెద్ద చెట్ల వద్ద ఆవాసాలు ఏర్పరుచుకొని జీవిస్తుంటాయి. ఇలాంటివి ఉన్నట్లుండి ఇంట్లోకి ప్రవేశిస్తే అది కచ్చితంగా ఏదో కీడును శంకిస్తుందని విశ్వసిస్తుంటారు. అయితే కొందరు మాత్రం గబ్బిలం ఇంట్లోకి వస్తే మంచిదే అనే అభిప్రాయంతో ఉంటారు. గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది అంటే గబ్బిలం లక్ష్మీ దేవి వాహనం కావడం వల్ల ఒకవేళ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని చెబుతుంటారు.
వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. మనుషులే తట్టుకోలేకపోతున్నారు ఇక పక్షులు, జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా ఓ గబ్బిలం పూల్‌లో ఈత కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలో ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గబ్బిలానికి ఈత కొట్టే సామర్థ్యం ఉందని తమకు తెలియదని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పిస్తూ గబ్బిలాన్ని స్విమ్మింగ్ పూల్‌లోకి పంపింది దానిని పెంచుకున్న యజమానురాలు. అది అచ్చం మనిషిలాగే ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుంది.
వీడియో చూడండి:
I have never once seen a bat swim. Wild. pic.twitter.com/PS6aEc06AP
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 16, 2025
