AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strawberry Health benefits: ఈ ఎర్రటి పండ్లు తింటే ఈజీగా బరువు తగ్గి నాజుగ్గా అవుతారు..! తప్పక ట్రై చేయండి..

స్ట్రాబెర్రీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు తగ్గడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.. ఎందుకంటే ఇది ఆకలిని నియంత్రించడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ఆహారం కోసం..

Strawberry Health benefits: ఈ ఎర్రటి పండ్లు తింటే ఈజీగా బరువు తగ్గి నాజుగ్గా అవుతారు..! తప్పక ట్రై చేయండి..
Strawberry
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2025 | 7:40 PM

Share

స్ట్రాబెరీలు తీసుకోవడం వల్ల ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే బరువు సులభంగా తగ్గిపోతారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు తినాలి. అంతేకాదు ఎండ కాలం ఈ పండు తీసుకోవడం వల్ల మంచి హైడ్రేషన్ అందిస్తుంది. ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. మన శరీరానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది.  స్ట్రాబెర్రీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు తగ్గడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.. ఎందుకంటే ఇది ఆకలిని నియంత్రించడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ఆహారం కోసం స్ట్రాబెర్రీలను తీసుకోవడం బెస్ట్‌ చాయిస్‌ అంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తాయి.

స్ట్రాబెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం వంటివి ఈ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కేలరీలను బర్న్ చేయడానికి మరింత అనుకూలంగా చేస్తాయి. స్ట్రాబెరీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ పండు క్యాలరీలు బర్న్ చేసే కెపాసిటీ కలిగి ఉంది. అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది గ్లైసెమిక్‌ సూచీ తక్కువగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటాయి. ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో, రోజంతా సంతృప్తి భావనను కొనసాగించడంలో సహాయపడుతుంది. స్ట్రాబెరీ స్మూథీ రూపంలో తీసుకోవచ్చు లేదా జ్యూస్ లా కూడా తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?