Health Tips: పుచ్చకాయ గింజలు పిచ్చివని పడేస్తున్నారా..? వాటి గురించి తెలిస్తే అస్సలు పడేయరు
వేసవి కాలంలో అనేక రకాలైన పండ్లు అందుబాటులో ఉంటాయి. పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో ఎక్కువ మంది తినే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. శారీరక ప్రయోజనాలు మాత్రమే కాదు..మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, అందరూ పుచ్చకాయ తినేసి దాని విత్తనాలు పడవేస్తుంటారు. కానీ, పుచ్చకాయ లాగే, దాని గింజలు కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 17, 2025 | 6:10 PM

పుచ్చకాయ గింజల్లో ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడం, డ్యామేజ్‌ని నిరోధించడంలో సహాయపడతాయి. తరచూ పుచ్చకాయ గింజలు తినటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

Watermelon Seeds

పుచ్చపండు గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజల్లో ఉండే ఆమైనో ఆసిడ్స్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. పుచ్చగింజల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

పుచ్చకాయ గింజల్లో ఉండే లైసిన్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు.. పుచ్చకాయ గింజల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.. ఇది లైకోపీన్ వల్ల క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది. మెదడు నరాలను బలపరుస్తుంది. కామెర్లు వంటి సమస్యలలో పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చపండులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి..పుచ్చకాయ గింజలలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఎముకలు కాకుండా, కండరాల పనితీరును పెంచడంలో, నరాలను చురుకుగా ఉంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.




