- Telugu News Photo Gallery Cinema photos Directors who impressed heroes with their making and got a second movie chance on the sets
Directors: మేకింగ్‌తో హీరోలను ఇంప్రెస్.. సెట్స్‌పైనే రెండో మూవీ ఛాన్స్..
ఒకప్పుడు స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసిన దర్శకులు ఇప్పుడు స్పీడు పెంచారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టేస్తున్నారు. సెట్స్ మీద ఉన్న సినిమాతో హీరోలను ఇంప్రెస్ చేసి కొత్త సినిమాకు డేట్స్ పట్టేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న దర్శకులు ఎవరు..? వాళ్లు బుక్ చేస్తున్న హీరోలు ఎవరు..? ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: Apr 17, 2025 | 6:34 PM

క్లాస్ లవ్ స్టోరీలు తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న దర్శకుడు హను రాఘవపూడి. ఏదో నెంబర్ కోసం అన్నట్టుగా కాకుండా చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేయటం హను స్టైల్. కానీ అప్‌కమింగ్ సినిమాల విషయంలో తన స్టైల్ మారుస్తున్నారు ఈ డైరెక్టర్.

ప్రజెంట్ ప్రభాస్ హీరోగా ఫౌజీ సినిమా చేస్తున్న హను, డార్లింగ్‌తో మరో మూవీకి ఓకే చెప్పారు. హను వర్కింగ్ స్టైల్ నచ్చిన ప్రభాస్, స్వయంగా మరో మూవీకి ఆఫర్ ఇచ్చారు. ఇది ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ఇది స్టార్ అవ్వాలంటే డార్లింగ్ లైనప్ పూర్తవల్సిందే.

హనులాగే క్లాస్ ఇమేజ్ ఉన్న మరో దర్శకుడు శేఖర్ కమ్ముల. కాఫీలాంటి సినిమాలు రూపొందించే శేఖర్, తన జోన్ నుంచి బయటకు వచ్చి కుబేర అనే థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ధనుష్ హీరోగా మరో సినిమాకు లైన్ క్లియర్ చేసేసుకున్నారు శేఖర్.

తెలుగు దర్శకులు మాత్రమే కాదు తమిళ దర్శకులు కూడా ఇదే ట్రెండ్లో ఉన్నారు. రజనీకాంత్ హీరోగా జైలర్ సినిమాను రూపొందించిన నెల్సన్, ముందు ఆ మూవీని ఒక్క పార్ట్‌గానే ప్లాన్ చేశారు.

మేకింగ్ టైమ్‌లో నెల్సన్ వర్కింగ్ స్టైల్ నచ్చిన రజనీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో జైలర్ 2ను పట్టాలెక్కించారు. ఇలా తమ మేకింగ్ స్టైల్‌లో హీరోలను ఇంప్రెస్ చేస్తున్న దర్శకులు వన్ ప్లస్ వన్ ఆఫర్ కొట్టేస్తున్నారు.




