Pooja Hegde: నేను గ్యాప్ ఇవ్వాల.. అదే వచ్చిందంటున్న పూజా హెగ్డే
హీరోయిన్ కెరీర్ ఒక్కసారి పడిపోయిన తర్వాత మళ్ళీ పుంజుకోవడం చాలా కష్టం. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో గానీ.. ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అయితే ఉండదు. అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది ఓ బ్యూటీ. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..?
Updated on: Apr 17, 2025 | 7:30 PM

ఓ టైమ్‌లో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే.. ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు.

హీరోయిన్‌గా కమిటైన పూరీ జగన్నాథ్ జనగణమనతో పాటు గాంజా శంకర్ సినిమాలు ఆగిపోవడం.. కార్తిక్ దండు, చైతూ సినిమా నుంచి తప్పించడంతో పూజా కెరీర్ తెలుగులో పూర్తిగా గాడి తప్పింది.

టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజా. ప్రస్తుతం తమిళంలో సూర్యతో నటిస్తున్న రెట్రో మే 1న విడుదల కానుంది. దాంతో చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు పూజా.

తను గ్యాప్ తీసుకోలేదని.. అలా వచ్చిందంటున్నారు ఈ బ్యూటీ. ఈ మధ్యే ఓ తెలుగు సినిమా సైన్ చేసానని.. త్వరలోనే అదేంటో తెలుస్తుందన్నారీమే. సూర్య రెట్రోతో పాటు రజినీకాంత్ కూలీ, విజయ్ జన నాయగన్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.

అలాగే హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. కానీ ఎటొచ్చీ తెలుగులోనే ఈమెకు ఛాన్సుల్లేవు. అందుకే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పూజా. మరి ఈమె ట్రయల్స్ వర్కవుట్ అవుతాయా లేదా చూడాలిక.




