నల్ల శనగలను ఇలా తింటే నమ్మలేని లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలే వదిలిపెట్టరు!
నల్ల శనగలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నల్ల శనగపప్పు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేసే ఇనుము, ఇతర పోషకాలకు నిధి వంటివి. చాలా మంది వీటిని కూరగా తింటారు. ఉడకబెట్టి తింటారు. కానీ వీటిని నానబెట్టిన తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా..? నానబెట్టిన నల్ల శనగలను ఉదయం పరగడుపున తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 18, 2025 | 6:40 PM

Black Chickpeas

నానబెట్టిన శనగలు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులకు అత్యంత గొప్ప మూలం. అలాంటి నల్ల శనగలను నానబెట్టడం వల్ల అందులోని ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాల నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా అవి సులభంగా జీర్ణమవుతాయి. ప్రతిరోజూ ఒక గుప్పెడు నానబెట్టిన నల్ల శనగలు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.

అధిక బరువు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్న వారికి నల్ల శనగలు చాలా మంచిది. త్వరగా సన్న బడటానికి, అధిక బరువుతో పాటు కొలెస్ట్రాల్ తగ్గడానికి నానబెట్టిన నల్ల శనగలు ఎంతగానో దోహదపడతాయి. శనగలు కాల్షియం, ఫాస్ఫరస్ వంటి మంచి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవన్నీ ఎముకలకు బలాన్నిస్తాయి.

నల్ల శనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిటమిన్ బీ 6, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండి మెదడు, గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర అధికంగా ఉన్నవారికి షుగర్ నియంత్రణకు నల్ల శనగలు అద్భుతంగా పనిచేసే మంచి ఆహారం. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్నవారికి నల్ల శనగలు తినటం వల్ల ఉపశమనం కలుగుతుంది.. ముఖ్యంగా మల బద్దకంతో బాధపడేవారికి మంచి ఫలితాలు ఉంటాయి.

శనగలు శరీరానికి తగినంత శక్తిని ఇవ్వటానికి సహాయపడతాయి. మలబద్ధక నివారణకు మంచిది. ఉపయోగం ఉంటుంది. నల్ల శనగలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రోజు ఒక అరకప్పు నానబెట్టిన నల్ల శనగలు ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శనగలు చర్మ ఆరోగ్యానికే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండే నల్ల శనగలు నానబెట్టి తినటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ప్రేగులు, కడుపులో పేరుకుపోయిన విష వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం,అ జీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతి ఉదయం నానబెట్టిన శనగలు తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.




