3 ఉద్యోగాలను ఎప్పటికీ తీసివేయలేరు! - బిల్ గేట్స్

05 April 2025

Balaraju Goud

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత తెలివైనదైనా, దాని గొప్పతనం ఏంటో వివరించారు ప్రముఖ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్.

2022లో ChatGPT ప్రారంభించిన తర్వాత, కృత్రిమ మేధస్సు త్వరగా అనేక రంగాలలో తన స్థానాన్ని సంపాదించుకుంది.

గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్, డీప్‌సీక్ వంటి కంపెనీలు కూడా ఈ టెక్నాలజీలో ముందుకు సాగుతున్నాయి.

బిల్ గేట్స్ ప్రకారం, AI ఎప్పటికీ జీవశాస్త్రవేత్తలను భర్తీ చేయలేదు. జీవశాస్త్రంలో ఏఐ పరిశోధనలో సహాయకరంగా ఉండవచ్చు.

ఏఐ వ్యాధులను నిర్ధారించడానికి,శాస్త్రీయ ఆవిష్కరణలు చేయడానికి మానవులు ఇంకా అవసరం. DNA విశ్లేషణకు శాస్త్రవేత్తల సృజనాత్మకత, లోతైన అవగాహన అవసరం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గణనలను చేయగలదు. కానీ శాస్త్రీయ ఆవిష్కరణలకు మానవ మెదడుకు ప్రత్యామ్నాయం లేదు.

ఇంధన రంగంలో పరిశోధనలు, కొత్త సాంకేతికతలు అవసరం. ఇంధన రంగంలో AI సహాయకరంగా ఉంటుంది. కానీ దానిని పూర్తిగా ఆటోమేట్ చేయడం సాధ్యం కాదు.

టెక్ నిపుణులు AI మొదట కోడర్ల ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందంటున్నారు. AIని మెరుగుపరచడంలో మానవులు ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తారని బిల్ గేట్స్ విశ్వసిస్తున్నారు.

అనేక రంగాలలో AI వేగంగా దూసుకుపోతోంది. కొన్ని సంక్లిష్ట వృత్తులలో ఏఐ మానవులను భర్తీ చేయలేదు. జీవశాస్త్రవేత్తలు, DNA విశ్లేషకులు, ఇంధన నిపుణుల పాత్రలు కొనసాగుతాయి.