శ్రీరామనవమికి అయోధ్య వెళ్తున్నారా.? ఇవి తప్పక చూడండి..
04 April 2025
TV9 Telugu
ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య తనను తాను అలంకరించుకొంటుంది. ఆలయం నిర్మాణం తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి.
శ్రీరామనవమికి కొంతమంది అయోధ్య వెళ్తున్నారు. అయితే ఇక్కడ రామ మందిరం మాత్రమే చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.
కనక్ భవన్ ఆలయం: సీతారాములకు అంకితం చేయబడిన ఈ ఆలయం బంగారు స్తంభాలు అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది.
సీతా కి రసోయి: ఇది సీత ఆహారం వండుకున్న వంటగది. ప్రశాంతమైన తోటల మధ్య పురాతన రామాయణ పురాణాలతో చరిత్రకు కనెక్ట్ చేస్తుంది.
త్రేతా కే ఠాకూర్: రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన ఆలయం. ఇది అయోధ్యలోని నయా ఘాట్ వద్ద ఉంది.
నాగేశ్వరనాథ్ ఆలయం: సరయు నది ఒడ్డిన ఉన్న ఈ శివాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రశాంతమైన వాతావరణం, అందమైన నది దృశ్యాలకి ప్రసిద్ధి.
సూరజ్ కుండ్: ఇది పురాతన నీటి ట్యాంక్. శ్రీరాముడు ఉపయోగించాడని నమ్ముతారు. ఈ చారిత్రక ప్రదేశంలోని ప్రశాంత వాతావరణం అస్యాదించవచ్చు.
చోటి దేవకాళి ఆలయం: ఇది జనసమూహానికి దూరంగా ఉన్న కాళి ఆలయం. అడవులు, పచ్చదనం మధ్య విల్లసిల్లుతుంది ఈ టెంపుల్.
మరిన్ని వెబ్ స్టోరీస్
పరిమితిలో రెడ్ వైన్.. ఆ సమస్యలకు దివ్యఔషదం..
కరివేపాతో యూరిక్ యాసిడ్‌కి చెక్.. ఎలా అంటే.?
పచ్చి మామిడితో బరువు సమస్య దూరం..