షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినొచ్చా.?

04 April 2025

TV9 Telugu

ఒక కప్పు పుచ్చకాయలో 11 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది కొంచెం తక్కువ పరిమాణం అయినప్పటికీ, దాని కిలైసీమిక్ ఇంటక్స్ 72 ఉంటుంది.

ఇందులో గ్లైసీమిక్ ఇంటక్స్ ఎక్కువగా ఉన్నందున షుగర్ పేషెంట్స్ పుచ్చకాయను చాలా తక్కువ స్థాయిలో తినడం మంచిది.

పుచ్చకాయలో విటమిన్ సి, ఎ, బి6 వంటి పోషకాలు, మెగ్నీషియం, ఫోలేట్, ఐరన్, కాల్షియం, పాస్పరస్, ఎక్కువగా ఉన్నాయి.

ఇందులో లైకోపిన్, సిడ్రులిన్ వంటి యాంటిఆక్సిటెన్స్ ఉన్నాయి. ఇది రక్త నాళాలలో వాపు ఏర్పడకుండా సంరక్షిస్తుంది.

పుచ్చకాయ రక్తంలో ఒత్తిడిని నిలకడగా ఉంచడంతో ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు నిపుణులు.

పుచ్చకాయలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను పెంచుతుంది.

ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల, చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది. దురద, చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

పుచ్చకాయలోని అమైనో ఆమ్లాలు, సిట్రులైన్ కండరాల నొప్పులు, కండరాల వాపును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.