Tollywood: 5 పెళ్లిళ్లు.. 300లకు పైగా సినిమాలు.. చేతిలో పైసా లేకుండా చనిపోయిన హీరో.. గదిలో రెండు రోజులు..
300లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. నిజజీవితంలో 5 వివాహాలు చేసుకున్నాడు. నటుడిగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న అతడు.. చేతిలో పైసా లేకుండా ఆర్థిక ఇబ్బందులతో మరణించాడు. 57 ఏళ్ల వయసులోనే ఒంటరిగా జీవించి చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

సినీరంగుల ప్రపంచంలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతడి వ్యక్తిగత జీవితం మాత్రం విషాదం, బాధతో ముగిసింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. అతను 5 సార్లు వివాహం చేసుకున్నాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అతని స్క్రీన్ కెరీర్, వ్యక్తిగత జీవితం అంత బాగా సాగలేదు. ఆ బాలీవుడ్ నటుడు మహేష్ ఆనంద్. ‘సనమ్ తేరీ కసమ్’, ‘కరీష్మా’, ‘భవానీ జంక్షన్’, ‘ఇన్సాఫ్’, ‘గంగా యమునా సరస్వతి’, ‘తూఫాన్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన ఆ వ్యక్తికి 1982లో తొలి సినిమా అవకాశం వచ్చింది. అతని చివరి చిత్రం ‘రంగీలా రాజా’, ఇది 2019లో విడుదలైంది.
అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖ నటులు నటించిన చిత్రాలలో విలన్‌గా నటించాడు. 300 సినిమాల్లో నటించినప్పటికీ తన చివరి సంవత్సరాల్లో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహేష్ ఆనంద్ నిరుద్యోగిగా మారిపోయాడు. అలాగే ఫ్యామిలీ నుంచి విడిపోయాడు. సొంతవాళ్లే మోసం చేశారు. కోట్లు తీసుకుని అతడిని దారుణంగా మోసం చేయడంతో చివర్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. మహేష్ ఆనంద్ 5 వివాహాలు చేసుకున్నాడు. కానీ 2019లో అతడు మరణించినప్పుడు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. 57 ఏళ్ల వయసులో తన గదిలో మరణించగా.. రెండు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు.

Mahesh Anand Life
భార్య నుండి విడిపోయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మహేష్ ఆనంద్, మద్యం సీసాలతో నిండిన గదిలో శవమై కనిపించడంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. మహేష్ ఆనంద్ తెలుగుతోపాటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించాడు.
ఇవి కూడా చదవండి :
