వావ్ గ్రేట్.. బోట్‌లో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసి రికార్డు సృష్టించిన భారతీయుడు

ప్రపంచ సేయిలింగ్ రేసు అయిన గోల్డెన్ గ్లోబ్ రేసును కేరళకు చెందిన అభిలాష్ టామి పూర్తి చేసి రికార్డు సృష్టించారు. 1968లో సర్ రోబిన్ జాన్స్‌టాన్ అనే వ్యక్తి ఒంటిరిగా బోట్‌లో ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. ఇప్పడు అతని లాగే అలా సోలోగా బోట్‌లో ప్రపంచాన్ని చట్టేసి వచ్చిన వ్యక్తిగా అభిలాష్ నిలిచాడు.

వావ్ గ్రేట్.. బోట్‌లో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసి రికార్డు సృష్టించిన భారతీయుడు
Abhilash Tomy
Follow us

|

Updated on: Apr 30, 2023 | 10:16 AM

ప్రపంచ సేయిలింగ్ రేసు అయిన గోల్డెన్ గ్లోబ్ రేసును కేరళకు చెందిన అభిలాష్ టామి పూర్తి చేసి రికార్డు సృష్టించారు. 1968లో సర్ రోబిన్ జాన్స్‌టాన్ అనే వ్యక్తి ఒంటిరిగా బోట్‌లో ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. ఇప్పడు అతని లాగే అలా సోలోగా బోట్‌లో ప్రపంచాన్ని చట్టేసి వచ్చిన వ్యక్తిగా అభిలాష్ నిలిచాడు. అయితే రేస్ 2022 సెప్టెంబర్ 4 న ఫ్రాన్స్‌లో ప్రారంభమయ్యింది. 11 దేశాల నంచి 16 మంది నావికులు ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ ఇద్దరు మాత్రమే ఎంతో కఠినమైన ఈ సెయిలింగ్ రేసును పూర్తి చేయగలిగారు. అందులో మొదటి స్థానంలో సౌత్ ఆఫ్రికాకు చెందినకిర్‌స్టెన్‌ న్యూషాఫర్‌ దక్కించుకోగా.. అభిలాష్ టామి రెండోస్థానంలో నిలిచాడు.

అయితే ఈ సెయిలింగ్ రేసులో ఉన్న నిబంధనల ప్రకారం 1968 కాలంలో ఉన్న సాంకేతికతో కూడిన బోట్లలోనే ఆ నావికులు వెళ్లాలి. కఠినమైన సవాళ్లు ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నావికులు మాత్రమే రేసును పూర్తి చేశారు. ఇందులో మన దేశానికి చెందిన అభిలాష్ టామీ ఉండటం విశేషం. మొత్తం 48 వేల కిలోమీటర్ల దూరాన్ని అభిలాష్ 236 రోజుల్లో పూర్తి చేశారు. 2018లో కూడా ఇలాంటి పోటీలోనే అభిలాష్ పాల్గొన్నాడు. కానీ హిందూ మహా సముద్రంలో తుపాను రావడంతో తన బోటు విరిగిపోయింది. అలాగే అతని వెన్నుముక కూడా విరిగిపోయింది. మూడు తర్వాత అతడ్ని ఫ్రెంచ్ నౌకదళ నౌక అతడ్ని రక్షించింది. కానీ అభిలాష్ మాత్రం తన లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. సర్జరీ చేసుకున్న తర్వాత మళ్లీ రేస్ కోసం సిద్ధమయ్యాడు. చివరికి ఇప్పుడు జరిగిన పోటీలో గెలిచి తనను తాను నిరూపించుకున్నాడు. అభిలాష్ సాధించిన విజయానికి భారత నావికా, వాయు దళాధిపతులతో పాటు కేరళ సీఎం పినరయ్ విజయన్ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..