Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ కలకలం.. ఈజీ మనీకి కోసం గంజాయి అమ్మకాలు.. ముగ్గురు అరెస్ట్
గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా సిటీలో ఏదో చోట దానికి సంబంధించి లింకులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఎండు గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్న వ్యక్తిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా.. హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలో ఒకే రోజు.. రెండు వేర్వేరు చోట్ల ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లు పట్టుబడ్డారు. అవును గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా సిటీలో ఏదో చోట దానికి సంబంధించి లింకులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఎండు గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్న వ్యక్తిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దుప్పల నరేష్ అనే యువకుడు కూకట్‌పల్లి పరిధిలోని ముసాపేటలో వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తూ.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమంగా గంజాయి అమ్మకాలు చేస్తున్నాడు. విశాఖలో బాలాజీ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి.. కూకట్‌పల్లి మూసాపేట్‌లో అమ్మకాలు చేస్తున్నాడు.
అయితే.. శనివారం ఉదయం మూసాపేట్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో అనుమానంగా సంచరిస్తున్న నరేష్‌ను పోలీసులు ప్రశ్నించడంతో బాగోతం బట్టబయలైంది. అతని వద్ద నుంచి కిలో 700 గ్రాముల ఎండు గంజాయితోపాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న మరో ఇద్దరిని కూడా కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి వై జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 17.2 గ్రాముల ఎండీఎంఏ(MDMA) నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కూకట్‌పల్లి పోలీసులు. బెంగళూరులో సేల్స్‌మెన్‌గా పనిచేసే ఇద్దరు యువకులు.. ఈజీ మనీకి అలవాటు పడి డగ్స్ అక్రమ తరలింపునకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. కూకట్‌పల్లి పోలీసులు తనిఖీలు చేయడంతో ఒకే రోజు రెండు చోట్ల గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లు పట్టుబడ్డారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్ట్ వివరాలను కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్ వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ విషయంలో ఉపేక్షించేదిలేదన్నారు ఏసీపీ చంద్రశేఖర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..