Bhadrachalam: ఈ నెల 16 నుంచి భద్రాద్రి రామయ్యకు నూతన సేవలు.. ఏ సేవలకు ఎంత రుసుము చెల్లించాలంటే..

సీతారాములకు నూతన పూజలను, సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానుందని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. ఈ నెల 16 నుంచి పూజలను, సేవలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. అయితే ఇప్పటికే నిర్వహిస్తున్న పూజలు, సేవలు యధాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు రమాదేవి

Bhadrachalam: ఈ నెల 16 నుంచి భద్రాద్రి రామయ్యకు నూతన సేవలు.. ఏ సేవలకు ఎంత రుసుము చెల్లించాలంటే..
Bhadrachalam Temple
Follow us

|

Updated on: Apr 10, 2023 | 8:21 AM

దక్షిణ అయోధ్య భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లతో పాటు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వస్తూ ఉంటారు. సీతారాములను దర్శించుకుని పూజాదికార్యక్రమాలు నిర్వహించి తమ మొక్కలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సీతారాములకు నూతన పూజలను, సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానుందని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. ఈ నెల 16 నుంచి పూజలను, సేవలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. అయితే ఇప్పటికే నిర్వహిస్తున్న పూజలు, సేవలు యధాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు రమాదేవి. ఏఏ సేవలు ఏ సమయంలో భక్తులకు అందుబాటులో ఉందనున్నాయి.. ఎంత రుసుము వసూలు చేయనున్నారో తెలుసుకుందాం..

ఆలయంలో అర్చకులతో వేదాశీర్వాదం: సీతారాములను దర్శనం చేసుకున్న అనంతరం.. ఈ వేదాశీర్వచనాన్ని ఆలయంలోని బేడా మండపంలో చేయనున్నారు. ఈ ఆశీర్వాదం ఉదయం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండనుంది. వేదాశీర్వచనం కోసం చెల్లించాల్సిన రుసుము రూ. 500.

స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ: ఈ సేవనే ఉదయాస్తమాన సేవ అని కూడా పిలుస్తారు. రోజూ భక్తులకు ఈ సేవ అందుబాటులో ఉండనుంది. ఒక్క టికెట్ పై ఒకరికి లేదా దంపతులకు ప్రవేశం ఉంటుంది. ఈ సేవకు ధర రూ. 5000. అయితే ఆదివారం వారం మాత్రం పది టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ సేవ టికెట్ ను తీసుకున్నవారు స్వామివారి సుప్రభాతం నుంచి మొదలు అభిషేకం, అంతరాలయ అర్చన, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి అర్చన, శ్రీ ఆంజనేయస్వామి అర్చన, నిత్య కల్యాణంలో పాల్గొనవచ్చు. అంతేకాదు దర్బారు సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ ఆ రోజు మొత్తంలో ఆలయంలో జరిగే వివిధ సేవలను అర్చనల్లో పాల్గొనవచ్చు.

తులసి మాల అలంకరణ: సీతారామచంద్ర స్వామికి ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు తులసిమాలను సమర్పించవచ్చు. అనంతరం ఈ మాలను ప్రసాదంగా అందిస్తారు. ఈ మాల అలంకరణ సేవకు రుసుము రూ.1000. ఈ సేవలో ఒకరు లేదా దంపతులు పాల్గొనే అవకాశం

నిత్య పూలదండల అలంకరణ: ఆదివారం మినహా ప్రతి రోజూ అందుబాటులో ఉండే ఈ సేవలో ప్రధానాలయంలోని స్వామివారితో పాటు అనుబంధంగా ఉన్న ఆలయాల్లో పూలదండలు సమర్పించవచ్చు. ఈ సేవలో పాల్గొనాలంటే..రుసుము రూ. 5 వేలు.

ముత్యాల సమర్పణ: భద్రాద్రిలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా జరిగే సీతారాముల కల్యాణంలో ఉపయోగించే ముత్యాల కోసం ఇప్పటినుంచి డబ్బులను చెల్లించవచ్చు. శ్రీరామ నవమి ముత్యాల కోసం రూ. 10,000 లను చెల్లించాల్సి ఉంది. అంతేకాదు ఈ సేవ టికెట్ ను తీసుకున్నవారికి  ఆ రోజు కళ్యాణం జరిగే సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు రెండు టికెట్లను భక్తులకుఇస్తారు.

తులాభారం: స్వామివారికి తులాభారం సమర్పించాలంటే.. ప్రతి రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇందుకు గాను రుసుము రూ.100.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles