AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒక్కరోజులో స్వామివారి దర్శనం.. ఈ టూర్ ప్యాకేజీపై ఓ లుక్ వేయండి..

అయితే ఎక్కువ రోజులు తిరుమల పర్యటనకు కేటాయించలేని భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది IRCTC. శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం రూ. 1000 లోపు ప్యాకేజీని భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఒక్క రోజు పర్యటనను భక్తుల కోసం ప్లాన్ ను ప్రకటించింది.

IRCTC Tour : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒక్కరోజులో స్వామివారి దర్శనం.. ఈ టూర్ ప్యాకేజీపై ఓ లుక్ వేయండి..
Irctc Tour Package
Surya Kala
|

Updated on: Apr 10, 2023 | 9:27 AM

Share

మానవులను కష్టాల నుంచి రక్షించడానికి అవతరించిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తారు. తిరుమల తిరుపతిని ఇలా వైకుంఠంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్క రోజైనా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకోవాలని భావిస్తారు. అయితే ఎక్కువ రోజులు తిరుమల పర్యటనకు కేటాయించలేని భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది IRCTC. శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం రూ. 1000 లోపు ప్యాకేజీని భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఒక్క రోజు పర్యటనను భక్తుల కోసం ప్లాన్ ను ప్రకటించింది. ఈ యాత్రలో తిరుమల శ్రీవారిని మాత్రమే కాదు వెంకన్న భార్య పద్మావతి దేవి కొలువైన తిరుచానూరు- పద్మావతి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.

ఏ తేదీన అందుబాటులో ఉండనున్నదంటే

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు IRCTC టూర్ ను ఏప్రిల్ 15వ తేదీన అందుబాటులోకి తీసుకుని రానుంది.

ఇవి కూడా చదవండి

దర్శన కోసం ప్రయాణం IRCTC వెబ్‌సైట్ ప్రకారం “తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉదయం 08:00 గంటలకు భక్తులను పికప్ చేసుకుని తిరుమల కొండకు తీసుకుని వెళ్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం 13:00 గంటలకు  చేయిస్తారు. అయితే ఈ దర్శన సమయం ఆ రోజు కొండపై ఉండే రద్దీని బట్టి ఆధారపడి ఉంటుంది. దర్శనం అనంతరం భక్తులు స్వామివారి అన్న ప్రసాదం తీసుకోవచ్చు.. లేదా సొంత ఖర్చుతో భోజనం చేయాల్సి ఉంటుంది. అనంతరం..  శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం కోసం తిరుచానూరుకి తీసుకుని వెళ్లారు. అనంతరం తిరిగి ఆ రోజు సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తులను దిగబెడతారు.

ఈ ప్యాకేజీలో భాగంగా ఆన్‌లైన్‌లో బుకింగ్  చేయాలనుకుంటే..  IRCTC ఎగ్జిక్యూటివ్/TIFCని సంప్రదించండి. ప్యాకేజీ టారిఫ్ ను ఇప్పటికే నిర్ణయించారు. అయినప్పటికీ ఈ టూర్ ప్యాకేజీ ధరలో IRCTC/ప్రభుత్వం ప్రకారం మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ టూర్ లో శ్రీవారిని ఒక్కరోజులోనే దర్శించుకోవాలంటే మరిన్ని వివరాల కోసం అధికారిక IRCTC టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్