Green Grape Halwa: పచ్చ ద్రాక్ష పండ్లతో టేస్టీ టేస్టీ హల్వాను ఈజీగా తయారు చేసుకోండి..

ద్రాక్ష పండ్లను స్మూతీ తయారీలతో పాటు ఫ్రూట్ సలాడ్, పెరుగులో కూడా వినియోగిస్తారు. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పచ్చ ద్రాక్షలో  పిండి పదార్థాలు, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా లభిస్తాయి. ఈ రోజు ద్రాక్ష పండ్లను ఉపయోగించి రుచికరమైన హల్వా తయారీ చేయడం తెలుసుకుందా..

Green Grape Halwa: పచ్చ ద్రాక్ష పండ్లతో టేస్టీ టేస్టీ హల్వాను ఈజీగా తయారు చేసుకోండి..
Green Grape Halwa
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2023 | 10:24 AM

పండ్లలో ద్రాక్ష పండ్లు ఒకటి.. వీటిల్లో అనేక రకాలున్నాయి. నల్ల ద్రాక్ష, గింజలు ఉన్నవి.. గింజలు లేనివి.. ఎరువు రంగు ద్రాక్ష ఇలా    చాలా రకాల ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని తీపిగా ఉంటే మరొకొన్ని పుల్లగా ఉంటాయి. ఇక ద్రాక్ష పండ్లను స్మూతీ తయారీలతో పాటు ఫ్రూట్ సలాడ్, పెరుగులో కూడా వినియోగిస్తారు. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పచ్చ ద్రాక్షలో  పిండి పదార్థాలు, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా లభిస్తాయి. ఈ రోజు ద్రాక్ష పండ్లను ఉపయోగించి రుచికరమైన హల్వా తయారీ చేయడం తెలుసుకుందా..

హల్వా తయారీకి కావాల్సిన పదార్ధాలు: 

గింజలు లేని పచ్చ ద్రాక్ష – 500 గ్రాములు

ఇవి కూడా చదవండి

కార్న్ ప్లోర్ – మూడు టేబుల్ స్పూన్లు

పంచదార- టేస్ట్ కి సరిపడా

గ్రీన్ ఫుడ్ కలర్ – కొంచెం

నెయ్యి

నీరు

కిస్ మిస్ –

జీడిపప్పు

బాదం –

పిస్తా – పలుకులు

యాలకుల పొడి

తయారు చేసే విధానం: ముందుగా ద్రాక్ష పండ్లను గుత్తి నుంచి విడదీసి శుభ్రంగా కడుగుకోవాలి. అనంతరం నీరు లేకుండా తుడిచి వాటిని మిక్సీ బ్లైండర్ జార్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ద్రాక్ష రసాన్ని వేరు చేసుకోవాలి. ఇలా ద్రాక్ష రసం వేరు చేసే సమయంలో వడకట్టాలి. అనంతరం ఆ ద్రాక్ష రసంలో చక్కర వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ ప్లోర్ తీసుకుని నీటిలో కలిపి.. ఆ నీటిని ద్రాక్ష రసంలో వేసి బాగా కలపాలి. ద్రాక్ష రసం, పంచదార, కార్న్ ప్లోర్ బాగా కలిపి జ్యూసు రెడీ చేయాలి.

ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి రెడీ చేసుకుని జ్యూసును వేసి గ్యాస్ మంట స్విమ్ లో పెట్టి.. ద్రాక్ష రసం జ్యూసును గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ద్రాక్ష జ్యూసును మాడిపోకుండా కలుపుతుండాలి. యాలకుల పొడి  వేసి మరికొంచెం వేడి చేస్తే.. ఈ మిశ్రమం గట్టిపడి ముద్దలా అవ్వుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. బాగా కలిసి ముద్దలా అయి బాండి అంచులు విడుతుంది. హల్వా రెడీ.

ఇంతలో ఒక ప్లేట్ ను తీసుకుని దాని అంచులకు లోపల నెయ్యి వేసి బాగా రాయాలి. ఆ నెయ్యి మీద జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు, పిస్తా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో ఉన్న ద్రాక్ష మిశ్రమాన్ని ప్లేట్ లో వేసి.. సమానంగా సర్దుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేస్తే టేస్టీ టేస్టీ ద్రాక్ష హల్వా రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..