AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: షిర్డీ, నాసిక్, త్రయంబకం చూడాలనుకుంటున్నారా.. ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్.. ప్యాకేజీ వివరాలు

ప్రతి శుక్రవారం ఈ టూర్ ని ఒక రాత్రి, రెండు రోజులు పాటు ఐఆర్ సీటీసీ అందిస్తోంది. ఈ టూర్ లో షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్, పంచవటి ప్రాంతాలను సందర్శించవచ్చు. 

IRCTC Tour: షిర్డీ, నాసిక్, త్రయంబకం చూడాలనుకుంటున్నారా.. ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్.. ప్యాకేజీ వివరాలు
Irctc Tour Pack
Surya Kala
|

Updated on: Apr 03, 2023 | 11:44 AM

Share

వేసవిలో వినోదం, తీర్ధ యాత్ర కలిసి వచ్చేలా ఏదైనా టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా.. అయితే వివిధ ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ వారు స్పెషల్ టూర్ ప్యాకేజీలు అందిస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా తెలుగు వారు హైదరాబాద్ నుంచి షిర్డీ యాత్రకు స్పెషల్ ఆఫర్ ను ఇస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుండి షిర్డీ-నాసిక్-త్రయంబకేశ్వర్-పంచవటి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ లో ట్రైన్ లో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతి శుక్రవారం ఈ టూర్ ని ఒక రాత్రి, రెండు రోజులు పాటు ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. ఈ టూర్ లో షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్, పంచవటి ప్రాంతాలను సందర్శించవచ్చు.

ఎవరైనా ఈ టూర్ లో భాగంగా టికెట్ బుక్ చేసుకోవాలంటే.. ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకోవాలంటే.. అప్పడు గ్రూప్ బుకింగ్ కోసం స్పెషల్ ధరలు ఎంపిక చేసుకోవచ్చు. ఇలా చేస్తే.. అప్పుడు ధరల్లో స్పెషల్ రేట్లు పొందుతారు. ఈ టూర్ లో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 18:50 గంటలకు, రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ లో బయలు దేరుతారు. ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి..

రెండో రోజు ఉదయం శనివారం ఉదయం 07:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి పర్యాటకులను షిర్డీకి తీసుకుని వెళ్లారు. షిర్డీలోని హోటల్‌ వద్ద బస ఏర్పాటు చేస్తారు. అనంతరం ఆ రోజు షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకోవాలి. పర్యాటకులు వెళ్లాలనుకుంటే.. షిర్డీకి దగ్గరలో వున్న ఇతర ప్రాంతాలను శని షింగాపూర్ కు వెళ్ళవచ్చు. షాపింగ్ చేయవచ్చు. రాత్రి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మూడో రోజు ఉదయం ఆదివారం షిరిడి లోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి నాసిక్ బయలు దేరాల్సి ఉంటుంది. అక్కడ ముందుగా త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. తర్వాత నాసిక్‌లోని పంచవటిని సందర్శించి తిరిగి సాయంత్రం సాయంత్రం 20:30 గంటలకునాగర్‌సోల్ స్టేషన్‌కు చేరుకోవాలి. రైలు నెం. 17063  అజంతా ఎక్స్‌ప్రెస్  ను  21:20 గంటలకు ఎక్కాలి. రాత్రి జర్నీ చేసి సోమవారం ఉదయం 08:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో బాబా ఆశీస్సులతో షిర్డీ యాత్ర ముగుస్తుంది.  ఈ టూర్ ప్యాకేజీలో రవాణా కోసం AC వాహనం, రెండు రోజుల అల్పాహారం, ప్రయాణపు భీమా, అన్ని వర్తిస్తాయి.

వివిధ ధరల జాబితా:

A/C 3-టైర్ కోచ్: సింగిల్ షేరింగ్: రూ.13420 డబుల్ షేరింగ్ లో ఒకొక్కరికి: రూ.8230 ట్రిపుల్ షేరింగ్ లో ఒకొక్కరికి రూ.6590 పిల్లలు (5-11 సంవత్సరాలు): హోటల్‌లో అదనపు బెడ్‌తో: రూ.5440

నాన్-ఎసి స్లీపర్ క్లాస్:

సింగిల్ షేరింగ్: రూ.11730 డబుల్ షేరింగ్ : రూ.6550 ట్రిపుల్ షేరింగ్:  రూ.4910/ పిల్లలు (5-11 సంవత్సరాలు): హోటల్‌లో అదనపు బెడ్‌తో: రూ.3760

A/C 3-టైర్ కోచ్:

డబుల్ షేరింగ్ : తలకు రూ.6630 ట్రిపుల్ షేరింగ్: తలకు రూ.5890 పిల్లలు (5-11 సంవత్సరాలు): హోటల్‌లో అదనపు బెడ్‌తో: రూ.5440

నాన్-ఎసి స్లీపర్ క్లాస్: డబుల్ షేరింగ్ : రూ.4940/ ట్రిపుల్ షేరింగ్: తలకు రూ.4200 పిల్లలు (5-11 సంవత్సరాలు): హోటల్‌లో అదనపు బెడ్‌తో: రూ.3760

A/C 3-టైర్ కోచ్ : గరిష్టంగా 06 మంది సభ్యులు నాన్-ఎసి స్లీపర్ క్లాస్ : గరిష్టంగా 16 మంది సభ్యులు

అయితే ఈ ప్యాకేజీ టూర్‌ని బుక్ చేసుకునే ముందు పర్యాటకులకు ముఖ్య గమనిక.. షిర్డీలోని సాయిబాబాబు దర్శించుకోవడానికి ముందుగా www.sai.org.in నుండి దర్శన స్లాట్ (ఉచిత స్లాట్ లేదా చెల్లింపు స్లాట్) బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..