- Telugu News Photo Gallery Summer Special Travelling on a budget: These Countries you can visit in under RS.3,000 per day, summer 2023
Summer Special: వేసవి వినోదం కోసం విదేశాలకు ప్లాన్ చేస్తున్నారా.. రోజుకు 3వేలలోపు ఈ దేశాలను సందర్శించవచ్చు..
వేసవి వచ్చిందంటే చాలు.. కొంతకాలం పనులకు గుడ్ బై చెప్పి ఎక్కడికైనా వెళ్లాలని.. అందమైన ప్రదేశాల్లో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం అందమైన దేశాలు ఉన్నాయి. భారతీయ ప్రయాణికుల బడ్జెట్ కు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో వివిధ దేశాలకు వెళ్ళవచ్చు. మీరు రోజుకు రూ. 3,000 కంటే తక్కువ ఖర్చుతో కొన్ని దేశాలను చుట్టెయ్యవచ్చు.
Updated on: Apr 02, 2023 | 10:33 AM

వేసవి వచ్చిందంటే చాలు.. కొంతకాలం పనులకు గుడ్ బై చెప్పి ఎక్కడికైనా వెళ్లాలని.. అందమైన ప్రదేశాల్లో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం అందమైన దేశాలు ఉన్నాయి. భారతీయ ప్రయాణికుల బడ్జెట్ కు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో వివిధ దేశాలకు వెళ్ళవచ్చు. మీరు రోజుకు రూ. 3,000 కంటే తక్కువ ఖర్చుతో కొన్ని దేశాలను చుట్టెయ్యవచ్చు.

థాయిలాండ్: ఆధునికత, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలగలిసిన భారతీయ ప్రయాణీకులకు థాయిలాండ్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం.. ఈ దేశంలో పర్యటనకు బడ్జెట్ అందుబాటులో ఉంటుంది. సహజమైన బీచ్‌లు, దట్టమైన అడవులు, పురాతన భవనాలు, నీటిలో తేలియాడే మార్కెట్‌ల వరకు.. థాయిలాండ్ లో భిన్నమైన పర్యటక ప్రదేశాలున్నాయి. ఇవి పర్యాటకులకు భిన్నమైన అనుభవాలను అందిస్తాయి. పర్యాటకులు స్థానిక షాపింగ్, వాటర్ స్పోర్ట్స్, ట్రెక్‌లు, నైట్ పార్టీలను ఎంజాయ్ చేయవచ్చు. థాయిలాండ్‌లోని క్రాబీ, బ్యాంకాక్, ఫుకెట్, పట్టాయా, ఫై ఫై ద్వీపాలు, చియాంగ్ మాయి ఉన్నాయి.

వియత్నాం: ఈ దేశాన్ని కూడా తక్కువ బడ్జెట్ తో సందర్శించవచ్చు. ఈ దేశంలోని సహజ సౌందర్యం, చరిత్ర, ప్రత్యేకమైన వారసత్వం పర్యాటకులను ఆకర్షిస్తాయి. విలాసవంతమైన డే క్రూయిజ్ లో విహరిస్తూ.. సుందరమైన హా లాంగ్ బేను అన్వేషించవచ్చు. ద్వీపానికి వెళ్లవచ్చు లేదా సాంస్కృతిక పర్యటనలలో మునిగిపోవచ్చు. వియత్నాంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలల్లో ఈ దేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయంగా భావిస్తారు. వియత్నాంలోని ప్రసిద్ధ గమ్యస్థానాలలో హనోయి, సాపా, హో చి మిన్ సిటీ, హా లాంగ్ బే, న్హా ట్రాంగ్, మెకాంగ్ డెల్టా ఉన్నాయి.

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ భారతీయ ప్రయాణికులకు ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది పర్యాటకులకు స్వర్గధామం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫాను సందర్శిస్తారు. ఎడారి సఫారీలు, క్యాంపింగ్, ఇండోర్ స్కీయింగ్, స్కైడైవింగ్, షాపింగ్‌ను చేయవచ్చు. దుబాయ్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య వాతావరణం పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.

ఇండోనేషియా: ఇండోనేషియా సహజ సౌందర్యం .. సముద్ర తీరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశాన్ని కూడా సాధారణ బడ్జెట్ తో సందర్శించవచ్చు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాలి, జకార్తా, మలాంగ్, బాండుంగ్, లాంబాక్, యోగ్యకర్తలను సందర్శించవచ్చు. పర్యాటకులు వాటర్ స్పోర్ట్స్, నేచర్ టూరిజం, అగ్నిపర్వత పర్యటనలు, మతపరమైన పర్యటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇండోనేషియా సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్.. ఇక్కడ ఈ సమయంలో వాతావరణం పొడిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

థాయిలాండ్, వియత్నాం, దుబాయ్, ఇండోనేషియా దేశాలలో మాత్రమే కాదు నేపాల్, భూటాన్, వంటి ఇతర దేశాలను కూడా భారతీయులు పర్యటక దేశాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

COVID-19 మహమ్మారి కారణంగా.. ప్రయాణ పరిమితులు, మార్గదర్శకాలు దేశం నుండి దేశానికి మారవచ్చని గమనించడం ముఖ్యం. ఏదైనా అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి ముందు పర్యటన ప్రాంతాల వివరాలు, మార్గదర్శకాలను తనిఖీ చేయడం మంచిది





























