- Telugu News Photo Gallery Cinema photos Actress Honey Rose Response About Social Media Negative comments and body shaming telugu cinema news
Honey Rose: నాకు నచ్చినట్టుగా ఉంటా.. బాడీ షేమింగ్ పై హానీరోజ్ షాకింగ్ కామెంట్స్..
వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ కుట్టి హానీ రోజ్. ఈ మూవీతో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. హానీ అందాలకు.. నటనకు ఫిదా అయ్యారు సినీప్రియులు.
Updated on: Apr 02, 2023 | 9:10 AM

వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ కుట్టి హానీ రోజ్. ఈ మూవీతో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. హానీ అందాలకు.. నటనకు ఫిదా అయ్యారు సినీప్రియులు.

ఇక సినిమాలకంటే సోషల్ మీడియాలో బారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో హానీరోజ్ ఒకరు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నెట్టింట చేస్తున్న రచ్చ గురించి చెప్పక్కర్లేదు. అయితే కొన్నిసార్లు హానీ డ్రెస్సింగ్ పై విమర్శలు ఎదుర్కోంటుంది.

ఇటీవల ఓ షోరూం ఓపెనింగ్ లో పాల్గోన్న హానీరోజ్.. బాడీషేమింగ్ కామెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు నటీనటుల పై ప్రతికూల విషయాలు ఎందుకు చెబుతారనేది తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపింది.

కొన్నిసార్లు సోషల్ మీడియా కూడా ప్రతికూలంగా మారుతుందని అన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఏవిధంగా రెడీ కావాలి అనేది తన ఇష్టానుసారంగా ఉంటుందని అన్నారు.

అలాగే సినిమాల్లో పాత్రకు తగినట్లుగా తన డ్రెస్సింగ్ ఉంటుందని తెలిపింది. తనకు చీర అంటే ఇష్టమని.. కానీ అందులో నడవడమే కాస్త కష్టమని తెలిపింది.

హనీ డ్రెస్సింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువగా ఆమె చీరకట్టులోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.

హీరోయిన్ బరువు పెరిగినా.. లేదా తగ్గినా ప్రజలు నిత్యం ఎగతాళి చేస్తుంటారని..ప్రతి స్త్రీ ఇలాంటి మాటలు వింటూనే ఉంటుందని అన్నారు.

హీరోయిన్స్ పై వచ్చే నెగిటివ్ కామెంట్స్.. ట్రోల్స్ సినిమాలపై ప్రభావం చూపిస్తాయని.. అందుకే ప్రతి చిత్రాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటున్నట్లు తెలిపింది.

బాడీ షేమింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హానీరోజ్.. నాకు నచ్చినట్టుగా ఉంటానంటూ..




