Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ నెల 14 నుంచి లక్కంటే వీరిదే.. ఈ 7 రాశుల వారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది

Astro Tips: ప్రత్యక్ష దైవం.. గ్రహాలకు రాజు సూర్యుడు తన ప్రయాణంలో రాశులను మార్చుకోనున్నాడు. దీంతో ఈ ప్రయాణం ఏడు రాశుల వారికి మంచిది. ఈ రాశుల వారు డబ్బు, వృత్తి, ఆరోగ్యాల నందు శుభ ఫలితాలు పొందుతారు. 

Astro Tips: ఈ నెల 14 నుంచి లక్కంటే వీరిదే.. ఈ 7 రాశుల వారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది
Sun Enters Aries
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2023 | 5:02 PM

గ్రహాధిపతి సూర్యుడు ఏప్రిల్ 14న మేషరాశిలో అడుగు పెట్టనున్నాడు. మరోవైపు ఏప్రిల్ 20న ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. కనుక ఈ నెలలో సూర్యుడి రాశి మార్పు వెరీ వెరీ స్పెషల్ అని అంటున్నారు జ్యోతిష్యులు. వీరి  అభిప్రాయం ప్రకారం.. సూర్యుడు తన రాశిని మార్చుకోవడం వలన ఏడు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు డబ్బు, వృత్తి, ఆరోగ్యాల అందు శుభ ఫలితాలు పొందుతారు. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

మేషరాశి లో సూర్య సంచారము ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్‌లో మంచి వేగం ఏర్పడుతుంది.. శుభఫలితాలను పొందుతారు. పనిలో కొత్త అవకాశాలను పొందే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలం వ్యాపారులకు కూడా చాలా ఫలవంతంగా ఉంటుంది.

మిథున రాశి వారికి సూర్యుని సంచారం వృత్తి వ్యాపార రంగంలోని వారికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త, మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేసిన పనికి చాలా అభినందనలు పొందుతారు. ఈ సమయంలో ఎవరైనా వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకుంటే.. శుభకాలం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి కి ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. డబ్బు ఆదా అవుతుంది. పనిలో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.

సింహ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు అదృష్టం కలిసి వస్తుంది.  ఈ సమయంలో మీరు సాధారణం కంటే ఎక్కువ సంపాదిస్తారు.  వ్యాపార విస్తరణ కూడా అవకాశం ఉంది. ఈ సమయం ఈ రాశివారికి ఫలవంతంగా ఉంటుంది.

వృశ్చిక రాశి వారికీ సూర్యుడు రాశి మార్పు అత్యంత శుభప్రదం. వివిధ వనరుల నుండి డబ్బును పొందుతారు. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా కూడా శుభ సమయం. అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటుంది. పనిలో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు చేసిన కృషికి  ప్రశంసలను అందుకుంటారు.

ధనుస్సు రాశి వారు మెరుగైన ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించి అధిక లాభాలను ఆర్జిస్తారు. అంతేకాదు డబ్బులను అదా చేస్తారు. వీరి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం అవుతుంది. ఈ సమయంలో.. ఈ రాశివారు తాము అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందే సూచనలు ఉన్నాయి.

కుంభం రాశి వారికి సూర్యుడు రాశి మార్పు అనుకూల ఫలితాలను తెస్తుంది. కుంభ రాశి వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. ధనం లభిస్తుంది. అవుట్‌సోర్సింగ్ సహాయంతో మంచి లాభాలను పొందగలుగుతారు. భాగస్వామితో  సంబంధం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)