Astrology Tips: వివాహం ఆలస్యం అవుతుందా.. కుజ దోష నివారణకు మంగళవారం హనుమంతుని ఎలా పూజించాలంటే?
అయితే ఎవరికైనా జాతకంలో కుజ దోషం ఉంటే మంగళవారం హనుమంతుడిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అప్పుడు కుజుడు అనుగ్రహంతో వారికీ శుభం కలుగుతుంది. ఈరోజు మంగళవారం కుజ దోష నివారణ కోసం హనుమంతుడిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం..
శక్తికి భక్తికి ప్రతి రూపం హనుమంతుడు.. ఆరాధన సేవ గుణానికి నిలువెత్తు సాక్ష్యం ఆంజనేయ స్వామి.. రాముల వారిని తన గుండెల్లో బంధించుకున్న అపర భక్తుడు… ఆంజనేయ స్వామి సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువే. హిందూ సనాతన ధర్మంలో మంగళవారం సంకట మోచనుడు హనుమంతుడికి అంకితం చేయబడింది. అయితే శనివారం హనుమంతుడు పుట్టిన రోజు కనుక శనివారం కూడా పూజలను చేస్తారు. కొంతమంది హనుమంతుడి భక్తులు మంగళ, శనివారాల్లో కూడా పూజలు చేసి ఉపవాసం ఉంటారు. అయితే ఎవరికైనా జాతకంలో కుజ దోషం ఉంటే మంగళవారం హనుమంతుడిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అప్పుడు కుజుడు అనుగ్రహంతో వారికీ శుభం కలుగుతుంది. ఈరోజు మంగళవారం కుజ దోష నివారణ కోసం హనుమంతుడిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం..
- జాతకంలో కుజ దోషం ఉంటే ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించాలి. ఇలా ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజిస్తే.. కుజుడు శుభాలను కలుగజేస్తాడు.
- మంగళవారం రోజున హనుమాన్ స్తోత్ర పారాయణం ప్రారంభించండి. ఈ స్తోత్రాన్ని 21 సార్లు పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి. అయితే ఎవరికైనా 21 మార్లు హనుమాన్ స్తోత్రాన్ని చదివేందుకు సమయం కుదరని పక్షంలో మనస్ఫూర్తిగా హనుమంతుడిని పూజించి ఒక్కసారి మనస్పూర్తిగా ఈ స్తోత్రాన్ని జపించాలి.
- హనుమంత స్తోత్రాలను పఠించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి.
- వరుసగా 21 మంగళవారాలు హనుమాన్ దేవాలయంలో బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన జీవితంలో సుఖం, ఆనందం, శాంతి లభిస్తాయి.
- ఎవరైనా శారీరక రుగ్మతలతో బాధపడుతున్నట్లయితే.. అతను మంగళవారం నాడు హనుమంతుని చిత్రం ముందు ఒక పాత్రలో నీటిని నింపి ఉంచాలి. అలాగే హనుమాన్ చాలీసాను 21 రోజులు పఠించండి. పారాయణం తర్వాత నీటిని మార్చాలి. ఇలా 21 మంగళవారాలు చేయడం వలన అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది.
- ఎవరైనా ఏదైనా సమస్య లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లయితే, ఏదైనా మంగళవారం నుండి ‘ఓం హనుమంతే నమః’ మంత్రాన్ని 108 సార్లు జపించండి. శుభ ఫలితం లభిస్తుంది
మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)