Saturn Transit: కుంభరాశిలో శనిదేవుని సంచారం.. రానున్న 3 సంవత్సరాలు ఈ రాశుల వారికి నిరంతర లక్షీకటాక్షం..

గ్రహాల రాశి మార్పు మానవ జీవితంపై ఎంతంగా ప్రభావం చూపిస్తాయి. ఇక ఈ ఏడాది జనవరి 27న తన ఇష్టరాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించిన శనిదేవుడు, 2025 వరకు అక్కడే ఉంటాడు. ఫలితంగా రాశిచక్రంలోని  కొన్ని రాశులకు శుభకాలం, అదృష్టం పట్టాయని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆయా రాశులకు అనేక శుభలాభాలు

Saturn Transit: కుంభరాశిలో శనిదేవుని సంచారం.. రానున్న 3 సంవత్సరాలు ఈ రాశుల వారికి నిరంతర లక్షీకటాక్షం..
Shanidev
Follow us

|

Updated on: Apr 04, 2023 | 2:11 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయం వరకు రాశిచక్రంలో ఉండి తర్వాత తన రాశిని మారుస్తాయి. అలాగే ఇతర రాశులలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల రాశి మార్పు మానవ జీవితంపై ఎంతంగా ప్రభావం చూపిస్తాయి. ఇక ఈ ఏడాది జనవరి 27న తన ఇష్టరాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించిన శనిదేవుడు, 2025 వరకు అక్కడే ఉంటాడు. ఫలితంగా రాశిచక్రంలోని  కొన్ని రాశులకు శుభకాలం, అదృష్టం పట్టాయని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆయా రాశులకు అనేక శుభలాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్టవంతమైన రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

కుంభరాశిలో శని సంచారం ఈ రాశులకు శుభప్రదం:

కుంభ రాశి: శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడని మనకు తెలిసిందే. ఫలితంగా ఈ రాశివారికి ఈ సమయంలో ప్రత్యేక లాభాలు కలుగుతాయి. వీరు రానున్న మూడు సంవత్సరాలు కూడా రాజాలాగా జీవిస్తారు. ఇంకా సమాజంలో వారి వ్యక్తిత్వానికి ఉన్న విలువ మెరుగుపడుతుంది. పిల్లల వైపు నుంచి కూడా శుభవార్తలు ఉండవచ్చు. వైవాహిక జీవితాన్ని సుఖంగా గడపగలుగుతారు. ఈ రాశివారికి ఈ సమయంలో నిరంతర లక్ష్మీకటాక్షం కూడా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మిథున రాశి: కుంభరాశిలో సంచరిస్తున్న శనిదేవుని సంచారం మిథునరాశి తొమ్మిదో పాదంలో జరిగింది. దీనితో పాటు ఈ రాశి వారి జాతకంలో శషమహాపురుష రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పని సమయంలో ప్రయాణించవలసి ఉంటుంది. అవివాహితులైన వారికి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. ఈ రాజయోగం ఈ రాశి వారికి రెండున్నరేళ్లపాటు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: వృషభ రాశివారికి శనిదేవుని కుంభరాశి సంచారం శుభప్రదం కానుంది. ఎందుకంటే శని దేవుడు ఈ జాతక చక్రంలోని పదవ పాదంలో తిరుగుతున్నాడు. ఫలితంగా వీరి జాతకంలో కూడా శష రాజయోగం ఏర్పడింది. ఈ సమయంలో వృషభ రాశి వారు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాక ప్రమోషన్లు, జీతాలు పెరగడం వంటివి ఉంటాయి. ఇక వ్యాపార వర్గానికి చెందిన వారు అధిక లాభాలను పొందుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)