- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: 5 Items that you should never ever keep near your bed or sleeping place
Vastu Tips: బెడ్ దగ్గర ఉంచకూడని 5 వస్తువులివే.. ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తప్పవు..
వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను నిద్రించే ప్రదేశాలలో ఉంచకూడదు. వీటిని నిద్రించే చోట ఉంచడం వల్ల మానసిక, శారీర ఆరోగ్యం లోపిస్తుందని వాస్తు నిపుణుల సూచన. అంతేకాక ఆర్థిక సమస్యలు కూడా ఇబ్బందిపెడతాయని వారు హెచ్చరిస్తున్నారు.
Updated on: Apr 04, 2023 | 1:55 PM

వాస్తు శాస్త్రం పనులు జరిగితే చాలా పనులు సులువుగా జరుగుతాయి. మరి ఏయే వస్తువులను మంచం లేదా నిద్రించే ప్రదేశంలో ఉంచకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గాడ్జెట్స్: వాస్తు శాస్త్రం ప్రకారం మంచం కింద గాడ్జెట్స్ ఉంచకూడదు. దీని వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు నిద్ర రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇనుము, ప్లాస్టిక్: మీరు నిద్రించే ప్రదేశంలో ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులను కూడా ఉంచవద్దు. దీని కారణంగా ఇంట్లో భయంకరమైన వాస్తు లోపం తలెత్తి ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది.

చీపురు: మంచం లేదా నిద్రించే ప్రదేశంలో చీపురు ఉంచడం చాలా అశుభం. మనస్సు, మెదడుపై చీపురు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంతేకాకుండా ఇంట్లో ఆర్థిక అడ్డంకులు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు అనారోగ్యానికి కూడా గురవుతారు.

పాదరక్షలు: బంగారం,వెండి లేదా ఇతర లోహపు నగలు, అద్దం, బూట్లు, చెప్పులు వంటివాటిని మంచం కింద ఉంచవద్దు. వీటి వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే పొరపాటున కూడా మంచం కింద గాజు లేదా నూనె ఉంచవద్దు. ఎందుకంటే ఇవి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ప్రదేశంలో ఉంటే కుటుంబానికి హానికరం.

కడగని వంటపాత్రలు: కొన్ని సందర్భాలలోచాలా మంది తమ పడక దగ్గరే టీ, కాఫీ కప్పులు, లేదా భోజనం చేసిన ఎంగిలి ప్లేట్లు ఉంచుతారు. అయితే అది కుటుంబానికి అంత మంచిది కాదు. అది ఇంటి పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇంకా నిద్ర సమయంలో పీడకలలకు కారణం అవుతుంది.





























