- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti following these tips of chanakya will solve all your problems in telugu
Chanakya Niti: సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ విధానాలను అనుసరిస్తే ఈజీగా పరిష్కరించవచ్చు అన్న చాణక్య
చాణక్యుడు తన విధానాలలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వీటిని అనుసరించడం ద్వారా ప్రతి కష్టాన్ని సులభంగా పరిష్కరించవచ్చు. వాటిలో కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.
Updated on: Apr 03, 2023 | 3:44 PM


ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.

చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.

అదృష్టం మీద ఆధారపడకుండా కష్టపడి పనిచేసే వ్యక్తికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. అలాంటి వారి జీవితంలో డబ్బుకు లోటు అనేది కలగదు. అంతే కాకుండా జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కష్టపడి పనిచేసే వారు త్వరగా విజయం సాధిస్తారని చాణక్యుడు నమ్మాడు.

చాణక్యుడు ప్రకారం మూర్ఖులు, ద్రోహులను గౌరవించే చోట లక్ష్మీదేవి నివసించదు. మూర్ఖుల మాటలు వినేవాడు జీవితంలో ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుందని చాణక్యుడు నమ్మాడు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని విశ్వసించండి.





























