Astrology Remedies for Career: ఉద్యోగం, కెరీర్ లో ఆటంకాలా.. ఈ జ్యోతిష్య పరిహారాలు చేసి చూడండి..

ఒకొక్కసారి పని ప్రారంభించకముందే పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో కెరీర్,  ఉద్యోగం గురించి ఆందోళన కలుగుతుంది. ఈ రోజు కొన్ని సులభమైన జ్యోతిష్య నివారణల గురించి తెలుసుకుందాం.. 

Astrology Remedies for Career: ఉద్యోగం, కెరీర్ లో ఆటంకాలా.. ఈ జ్యోతిష్య పరిహారాలు చేసి చూడండి..
Astrology Remedies For Care
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2023 | 5:23 PM

కెరీర్‌లో మంచి విజయాలు సాధించాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే కొన్ని సార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఒకొక్కసారి పని ప్రారంభించకముందే పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో కెరీర్,  ఉద్యోగం గురించి ఆందోళన కలుగుతుంది. ఈ రోజు కొన్ని సులభమైన జ్యోతిష్య నివారణల గురించి తెలుసుకుందాం..

అరచేతుల్లో లక్ష్మీదేవి నివాసం  ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు అరచేతులను చూడాలి. అరచేతులలో లక్ష్మి దేవి నివసిస్తుంది. ఇది సంపదను ఇస్తుందని నమ్మకం.

కాకికి సేవ చేయండి శనివారం కాకులకు అన్నం పెట్టండి. జ్యోతిష్యంలో వృత్తిని శాసించే శనీశ్వరుడుకి వాహనం కాకి. కాకికి సేవ చేయడం వల్ల శనీశ్వరుడు  ప్రసన్నుడవుతాడు.

ఇవి కూడా చదవండి

సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో బెల్లం కలిపి ఉదయాన్నే సూర్యుడికి సమర్పించండి. సూర్యోదయం అయిన గంటలోపు ఇలా చేయాలి. నీటిని సమర్పించేటప్పుడు “ఓం హ్రీ సూర్యాయ నమః” అని 11 సార్లు జపించాలి.

గాయత్రీ మంత్రం, లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి గాయత్రీ మంత్రం, లేదా  మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం 31 సార్లు జపించాలి.

గణపతి బీజ మంత్రాన్ని పఠించండి గణేశుడిని విఘ్నలకు అధిపతి. ఎవరికైనా సమస్యలు ఎదుర్కొంటుంటే.. గణేశుడికి సంబంధించిన బీజ మంత్రం ఓం గం గణపతయే నమః” అని పఠించడం వల్ల కెరీర్‌లో ప్రయోజనాలు లభిస్తాయి.

జ్యోతిష్య నివారణలు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ రెండు అరచేతులను చూడండి. లక్ష్మీదేవి వేళ్ల చివరన, సరస్వతీ దేవి అరచేతి మధ్యలో,  అరచేతి అడుగు భాగంలో గౌరీ నివసిస్తారని నమ్మకం. ఉదయాన్నే అరచేతిని దర్శించుకోవడం వలన ఈ ముగ్గురు దేవతలను పూజించినట్లు. మీ చేతులను చూస్తూ ఈ మంత్రాన్ని జపించండి:

“కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం”

భయం అనేది మనిషికి పెద్ద శత్రువు. జీవితాన్ని స్తంభింపజేస్తుంది. ఆనందనాన్ని హరిస్తుంది.  ఒక్కసారి మీ మనసులో పాజిటివ్ థింకింగ్ లోపిస్తే.. జీవితంలో విజయం సాధించలేరు. కనుక ఎదురుదెబ్బలు, సవాళ్లు , కష్టాలు ఎన్ని ఎదురైనా ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి. స్వయం కృషి, దైవానుగ్రహం కలిసినప్పుడు కెరీర్‌లో మీరు ఊహించిన దానికంటే త్వరగా విజయం సాధించవచ్చు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)