Watch Video: మేకప్ లేకపోతే ఎలా..? అమ్మను అందంగా అలంకరించేసిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..

లిప్‌స్టిక్‌ని పెదవులకే వేసుకుంటారు కదా..? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకోకండి. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే మీకు కూడా ఈ సందేహమే తడుతుంది. అవును, స్త్రీలకు ఎంతో ఇష్టమైన లిప్‌స్టిక్‌ని మేకప్‌లాగా ముఖం నిండా అలముకుంది ఓ చిన్నారి. అంతేనా తన కంటే ముందు..

Watch Video: మేకప్ లేకపోతే ఎలా..? అమ్మను అందంగా అలంకరించేసిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..
Little Girl Using Lipstick
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 04, 2023 | 12:29 PM

లిప్‌స్టిక్ పెట్టుకోవడం అంటే చాలా మంది మగువలకు ఇష్టం. ఆ లిప్‌స్టిక్ ద్వారా తాము ఎంతో ఆకర్షణీయంగా, తమ ఆందాన్ని ద్విగుణీక‌ృతం చేసుకోవచ్చని వారి నమ్మకం. అయితే లిప్‌స్టిక్‌ని పెదవులకే వేసుకుంటారు కదా..? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకోకండి. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే మీకు కూడా ఈ సందేహమే తడుతుంది. అవును, స్త్రీలకు ఎంతో ఇష్టమైన లిప్‌స్టిక్‌ని మేకప్‌లాగా ముఖం నిండా అలముకుంది ఓ చిన్నారి. అంతేనా తన కంటే ముందు తన తల్లి ముఖాన్ని కూడా ఆ లిప్‌స్టిక్‌తో అలంకరించింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను ఆ చిన్నారి వాళ్ల అమ్మ నెట్టింట షేర్ చేసింది. దీంతో అది కాస్త ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

mampi.rahul అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో మీరు ఈ దృశ్యాలను చూడవచ్చు. తొలుత చిన్నారి వాళ్ల అమ్మ తన ఫేస్ మీద ఉన్న లిప్‌స్టిక్ మేకప్‌ని చూపిస్తుంది. తర్వాత ఇది ఎవరు చేసిన ఘనకార్యమో చూపిస్తా రండి అన్నట్టుగా సైగ చేసి తన చిన్నారి కూతురు దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఆ చిన్నారి కూడా తన ముఖానికి లిప్‌స్టిక్‌తో మేకప్ వేసుకుంటుంది. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

చిన్నారి మేకప్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by mampi.rahul (@mampi.rahul)

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. ఈ వీడియో తమకు చాలా నచ్చిందని, తమ పిల్లలు కూడా ఇలాగే చేస్తుంటారని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది ఎమోజీల ద్వారా కామెంట్ చేస్తున్నారు. ఇక వారిలో ఒక నెటిజన్ అయితే ‘మైరా బాగా మేకప్ వేస్తుంద’ని రాసుకొచ్చారు. ఇంకో నెటిజన్ ‘పిల్లలతో ప్రతి తల్లికి ఉండే కష్టమే ఇది’ అని కామెంట్ చేశారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వీడియోపై తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 34 లక్షల వీక్షణలు, లక్షా 77 వేల లైకులు, అలాగే వేయికి పైగా కామెంట్లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?