Saliva Benefits: ఈ సమస్యలకు లాలాజలమే చక్కని పరిష్కారం..! దాని ప్రయోజనాలు తెలిస్తే పొరపాటున కూడా ఊసేయరు..
చాలా మంది నిద్రలో లాలాజలం వదులుతుంటారు. ఉదయం లేచి దాన్ని చూడగానే అదేదో చెడ్డ అలవాటుగా, సమస్యగా భావిస్తుంటారు. అయితే ఆ ఆలోచన సరైనదని కాదని, పరగడపున వచ్చే లాలాజలం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. అవును, ఉదయం లేచినవెంటనే నోట్లో..
చాలా మంది నిద్రలో లాలాజలం వదులుతుంటారు. ఉదయాన్నే లేచి దాన్ని చూడగానే అదేదో చెడ్డ అలవాటుగా, సమస్యగా భావిస్తుంటారు. అయితే ఆ ఆలోచన సరైనదని కాదని, పరగడపున వచ్చే లాలాజలం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. అవును, ఉదయం లేచినవెంటనే నోట్లో ఉండే లాలాజలం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ లాలాజలంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉండడమే అందుకు కారణం. ఇంకా లాలాజలంలో కాల్షియం, గ్లూకోజ్, సోడియం, ఫాస్ఫేట్, పొటాషియం వంటివి ఉంటాయి. ఇవి యాంటీబయాటిక్స్‌గా పనిచేయడం ద్వారా దంతాల ఇన్ఫెక్షన్‌ని దూరం చేస్తాయి. అంతేకాక ఈలాలాజలం దంతాలు కుళ్ళిపోకుండా, రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఇంకా లాలాజలంలో ఉండే టైలిన్ అనే ఎంజైమ్.. మన కడుపు సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో కూడా ఉపయోగపడుతుంది. అందుకోసం ఉదయాన్నే నిద్రలేచి రోజూ ఒక గ్లాసు నీరు తాగితే చాలు.. నోటిలోని ఆ లాలాజలం నీటితో పాటు కడుపులోకి వెళుతుంది. అందుకే ఉదయాన్నే లేచి ఒక గ్లాస్ నీళ్లు తాగాలని మన పెద్దలు చెబుతుంటారు. కడుపులోకి చేరిన ఈ లాలాజలం చిన్న, పెద్ద ప్రేగులను శుభ్రచేయడంతో పాడు పూర్తి కడుపును శుభ్రపరుస్తుంది. తద్వారా జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా శరీరానికి ఎదురయ్యే డీహైడ్రేషన్ సమస్యను ఇది నియంత్రిస్తుంది.
అంతేకాక నోటి దుర్వాసనతో బాధపడేవారికి కూడా ఈ లాలాజలం ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి మనం తిన్న తర్వాత నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకుంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అయితే నాలుక ద్వారా ఉత్పన్నమయ్యే లాలాజలం నోటిలోని ఇన్ఫెక్షన్‌ను తొలగించి దుర్వాసనను తొలగిస్తుంది. దీని వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. ముఖ్యంగా కంటిచూపు తగ్గిన వారికి లాలాజలం వరం కంటే ఎక్కువే. ఉదయాన్నే కాటుక లాగా లాలాజలాన్ని తీసి కళ్లపై అప్లై చేయడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. దీంతో పాటు కళ్ల కింద ఏర్పడే నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. కంటి నొప్పికి కూడా ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు లాలాజలాన్ని ముఖంపై పూస్తే అవి తగ్గిపోతాయి. ఉపయోగకరంగా ఉంటుంది. శరీరం మీద ఉండే గాయాలను మాన్పడానికి కూడా లాలాజలం పనిచేస్తుంది.