చదువుల ఒత్తిడి.. అర్థాంతరంగా ముగిసిపోతున్న సరస్వతీ పుత్రుల జీవితాలు.. ఆరేళ్లలో ఎన్ని ఆత్మహత్యలంటే..?

ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి విద్యార్థి కల. అయితే ఈ పోటీ ప్రపంచంలో మార్కుల కోసం చదివే చదువుల ఒత్తిడి కారణంగా ఎందరో సరస్వతీ పుత్రుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. అవును, ఉన్న విద్యకు అనగానే అందరికీ..

చదువుల ఒత్తిడి.. అర్థాంతరంగా ముగిసిపోతున్న సరస్వతీ పుత్రుల జీవితాలు.. ఆరేళ్లలో ఎన్ని ఆత్మహత్యలంటే..?
Students' Suicides in educational institutes
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 04, 2023 | 11:32 AM

ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి విద్యార్థి కల. అయితే ఈ పోటీ ప్రపంచంలో మార్కుల కోసం చదివే చదువుల ఒత్తిడి కారణంగా ఎందరో సరస్వతీ పుత్రుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. అవును, ఉన్న విద్యకు అనగానే అందరికీ గుర్తొచ్చే ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత ఆరేళ్లలోనే 103 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. ఐఐటీ కేంద్రాల్లో 35 మంది, ఐఐఎం క్యాంపసుల్లో నలుగురు, ఎయిమ్స్‌ల్లో 11 మంది, ఎన్‌ఐటీల్లో 24 మంది, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 29 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తెలిపారు. సోమవారం(ఏప్రిల్ 3) జరిగిన లోక్‌సభ సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

అయితే ఇలా బలవన్మరణానికి పాల్పడినవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యాసంస్థలలో మరణించినవారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి(2020లో) ఒకరు, తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇంకా బిహార్‌, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపురల్లో ఉన్న విద్యాసంస్థలల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో బలవన్మరణాలు నమోదైనట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని విద్యాసంస్థల్లో ఆరేళ్లలో 18 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..