Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti: ఏడాదికి రెండు సార్లు హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

కొంతమంది ఆంజనేయ స్వామి భక్తులు అతని జన్మదినాన్ని కూడా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున పరిగణిస్తారు. బజరంజి బలి పుట్టిన రెండు తేదీలను చూస్తే.. ఏ తేదీ సరైనది అనే ప్రశ్న తరచుగా ప్రజలలో తలెత్తుతుంది. హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం.

Hanuman Jayanti: ఏడాదికి రెండు సార్లు హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
Hanuman Jayanti
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2023 | 11:19 AM

రామభక్తుడు మహా బలి హనుమంతుడికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలోని పంచాంగం ప్రకారం హనుమంతుడి పుట్టిన తేదీ చైత్ర మాసం పౌర్ణమి నాడు చెప్పబడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు చైత్ర పున్నమి కనుక దేశ వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ రోజున హనుమంతుడిని నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసినా  భక్తులకు కోరిన కోర్కెలు నెరవేరుతాయి. అయితే హనుమంతుడి జన్మదినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా రెండు రోజులు జరుపుకుంటారు.

కొంతమంది ఆంజనేయ స్వామి భక్తులు అతని జన్మదినాన్ని కూడా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున పరిగణిస్తారు. బజరంజి బలి పుట్టిన రెండు తేదీలను చూస్తే.. ఏ తేదీ సరైనది అనే ప్రశ్న తరచుగా ప్రజలలో తలెత్తుతుంది. హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం.

హనుమాన్ జయంతిని రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారంటే? పవన తనయుడు హనుమంతుడు పుట్టిన ఒక తేదీని ఆయన జన్మదినోత్సవంగా జరుపుకుంటే.. మరో తేదీని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. హిందూ మతానికి సంబంధించిన గ్రంధాల ప్రకారం.. కష్టాల నుంచి రక్షణ ఇచ్చే హనుమంతుడు మంగళవారం కార్తీక మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి తిథి నాడు మేషరాశిలో జన్మించాడు. అదే సమయంలో, చైత్రమాసంలో హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటారు. నిజానికి దీని వెనుక వేరే కారణం ఉంది. హనుమంతుడు పుట్టినప్పటి నుండి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఒకసారి చిన్నారి హనుమాన్ సూర్యుడిని చూసి.. అతడిని పండు అని భావించి దానిని తినడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు సూర్య దేవుడిని పండుగా భావించి తినబోతుండగా, దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. హనుమంతుపై దాడి చేశాడు. దీంతో అప్పుడు ఆ చిన్నారి హనుమాన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

అప్పుడు ఈ సంఘటన గురించి తెలుసుకున్న వాయు దేవుడికి కోపం వచ్చింది.. అప్పుడు వాయుదేవుడు కోపంతో.. గాలి ప్రవాహాన్ని నిలిపివేశాడు. అప్పుడు మొత్తం విశ్వంలో సంక్షోభం ఏర్పడింది. దీనిని నివారించడానికి.. దేవతలందరూ కలిసి సహాయం కోసం బ్రహ్మ దేవుడి వద్దకు వెళతారు. అప్పుడు బ్రహ్మ స్వయంగా, ఇతర దేవతలతో కలిసి వాయుదేవుని వద్దకు వెళ్లి పవన్ తనయుడు హనుమాన్ కు మళ్ళీ జీవం పోశాడు. రెండవ జీవితాన్ని ఇస్తాడు. అంతేకాదు.. ఇతర దేవతలందరూ తమ శక్తులను చిన్నారి హనుమాన్ కి  ఇస్తారు. ఈ రోజున హనుమంతుడు రెండవ జీవితాన్ని పొందాడు. అతనికి రెండవ జన్మ లభించిన రోజు చైత్ర మాసం పౌర్ణమి, అప్పటి నుండి హనుమాన్ జయంతి కూడా ఈ తేదీన కూడా జరుపుకుంటారు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)